May lashker e taiba will join with ISIS to attack on India

May lashker e taiba will join with isis to attack on india

Pakistan, Lashkar-e-Taiba, Terrorists, India, Mumbai Attacks, Attacks on India, ISIS, Terror Attack, PAK, Kashmir, Terror Camps

Pakistan based Terrorist group Lashkar-etaiba may join hands with ISIS group, to attack on India. Lashkar-e-taiba group already running camps in PAK.

లష్కరే తోయిబాతో కలిసి ఐఎస్ఐఎస్ భారత్ మీద దాడి...?

Posted: 11/20/2015 03:39 PM IST
May lashker e taiba will join with isis to attack on india

ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల టార్గెట్ గా భారత్ లేకున్నా కూడా పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తో చేతులు కలిపే పరిస్థితులు కనిపిస్తున్నట్లు ఆర్మీ కల్నల్ ఒకరు వివరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ భారత్ మీద దాడికి ఎల్లప్పుడు సిద్దంగానే ఉంటుంది. భారత్ లో ఎన్నో సార్లు హింసకు కారణమైన లష్కరే తోయిబా.. మరోసారి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో కలిసి హింసకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ముంబై లాంటి నగరాల్లో చాలా సార్లు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు తెగించింది. కాగా తమ లక్ష్యంగా ఉన్న ఇండియాలో దాడులకు పాల్పడేందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితలో లష్కరే తోయిబా లేదని.. కాబట్టి ఐఎస్ఐఎస్ తో కలిసి భారత్ మీద దాడులకు దిగవచ్చు అని తెలుస్తోంది.

భారత్ మీద దాడి చేసేందుకు ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సిద్దంగా ఉన్నట్లు కూడా ఆయన వివరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు 600 నుండి 700 మంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని... వారు భారత్ మీద యుద్దానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారని వివరించారు. బారత్ మీద దాడికి సిద్దంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాదాపు 30 నుండి 37 క్యాంపులను నడుపుతోందని. ప్రతి క్యాంప్ లో 20 నుండి 25 మంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాగా ఇప్పటికే భారత్ లో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలు భద్రతను మరింత కట్టుదిట్టం చెయ్యాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Lashkar-e-Taiba  Terrorists  India  Mumbai Attacks  Attacks on India  ISIS  Terror Attack  PAK  Kashmir  Terror Camps  

Other Articles