Ragging case in Nagarjuna university

Ragging case in nagarjuna university

Ragging, Nagarjuna University, AP, Ganta Srinivas, Chandrababu Naidu, Rishiteshwari, Suicide in Nagarjuna University

One more ragging case in Nagarjuna University. AP Minister Ganta Srinivas very serious on Nagarjuna University Ragging case

నాగార్జన వర్సిలీలో ర్యాగింగ్ భూతం

Posted: 11/23/2015 10:39 AM IST
Ragging case in nagarjuna university

నాగార్జున యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ భూతం వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో కాలంగా ర్యాగింగ్ భూతానికి బలైనా కానీ.. అక్కడి పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత కూడా ర్యాగింగ్ కు అడ్డుకట్ట పడకపోవడం విచారకరం.న మంత్రులు ఎంతలా వార్నింగ్ ఇచ్చినా.. ముఖ్యమంత్రే తాట తీస్తానని హెచ్చరించినా కానీ నాగార్జున యూనివర్సిటీలో మాత్రం ర్యాగింగ్ దారుణాలు ఆగడం లేదు. తాజాగా మరో ర్యాగింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ చేస్తున్న ఓ జూనియర్ విద్యార్థిని.. ఐదుగురు సీనియర్ విద్యార్థులు హాస్టల్ కు పిలిపించుకొని ర్యాగింగ్ చేసినట్లు మంత్రి గంటా శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

Also Read: రిషితేశ్వరి కేసు నిందితులకు కండిషనల్ బెయిల్
Also Read: అక్కడ ర్యాగింగ్ కు ప్రిన్సిపాలే కారణం

నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి అనే విద్యార్థిని బలైపోయింది. తన చావుకు కారణం.. కాలేజీలో  చదువుతున్న విద్యార్థులే అని సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయింది. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత నాగార్జున వర్సిటీలో చోటుచేసుకుంటున్న ర్యాగింగ్ ఘటనలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. దాంతో ఏపి ప్రభుత్వం కాలేజీ, యూనివర్సిటీలో జరుగుతున్న ర్యాగింగ్ మీద దృష్టిసారించింది. ప్రత్యేకంగా చర్యలను కూడా తీసుకంది. అయితే మంత్రి గంటా శ్రీనివాస రావు రెండు మూడు సార్లు యూనివర్సిటీలో పర్యటించి.. అక్కడి పరిస్థితిని కూడా సమీక్షించారు. కానీ పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మరి తాజాగా ఘటన తర్వాత ఏపి ప్రభుత్వం ర్యాగింగ్ మీద ఎలా కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలి.

Also Read: రిషితేశ్వరి డైరీలోని ‘మిస్టర్ X’ ఎవరు.?
Also Read: ర్యాగింగ్ చేస్తే జీవిత ఖైదు..? రిషితేశ్వరి ఘటనతో ఏపి సర్కార్ యోచన

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles