‘అనుమానం’ పెనుభూతం లాంటిది.. ఎవరినైనా పిచ్చివాడిలా మార్చేస్తుంది.. నిత్యం వేధిస్తూనే వుంటుంది.. బంధాల మధ్య చిచ్చుపెడుతుంది.. ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ ‘అనుమానం’ తరుచూ గొడవలకు దారితీయడమే కాకుండా ఘోరమైన దారుణాలకు పాల్పడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగిన భర్త.. తన భార్యను వేధింపులకు గురిచేయడంతోపాటు ఆమె తలను గొరిగేశాడు. అంతేకాదు.. సిగరెట్లతో వాతలు కూడా పెట్టాడు. ఈ ఘటన బహ్రెయిన్ లో జరిగింది.
బహ్రెయిన్ లో ఇటీవల ఓ జంటకు వివాహమయ్యింది. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సంతోషంగానే కొనసాగింది. అయితే.. ఆ తర్వాత భర్తకు ‘అనుమానం’ పెనుభూతంలా వెంటాడింది. తన భార్యకు వివాహేతర సంబంధం వుందని ఆ భర్త అనుమానించాడు. అంతే! అప్పటినుంచి ఆమెను నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. తాను ఇంట్లో లేని సమయంలో మరొక వ్యక్తితో కులుకుతున్నావంటూ భార్యపై ఆరోపణలు చేస్తూ.. ఆమెను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. అలాంటిదేమీ లేదని ఆమె ఎన్నిసార్లు చెప్పినప్పటికీ.. అతనిలో మార్పు రాలేదు. ఒకరోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. తన భర్తపై ఆమె తిరగబడింది. ‘తాను మరొకరితో సంబంధం పెట్టుకోలేదని ఎంతచెప్పినా వినిపించుకోవేంటి?’ అంటూ వాదించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్రత.. వెంటనే తన భార్య తలను గొరిగేశాడు. ఆపై.. కాలుతున్న సిగరెట్లతో ఒళ్ళంతా వాతలు పెట్టాడు. అనంతరం రూములో బంధించేశాడు.
అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నుంచి కాపాడండంటూ కోరింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే అతనిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం వచ్చినప్పటి నుంచి తనకు పిచ్చిపట్టినట్లయిందని.. అందుకే ఆమెను అలా వేధించానంటూ కోర్టుకు ఆ భర్త చెప్పాడు. ఇతనికి విధించే శిక్షను కోర్టు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more