congress leader shankar rao comments on congress defeat in warangal by election

After a long time again he is back with his unique type of comments

warangal by-election, shankar rao, sarve satyanarayana, former union leader, sarve satyanarayan defeat, congress lost, sarve lost warangal by poll, congress leader shanker rao, cantonment, shad nagar shanker rao

after a long time congress leader shankar rao talked to media with his unique type of comments on warangal by poll

మల్లోచ్చిండు.. మైక్ పట్టిండు.. ఏమన్నా చెప్పిండా.. శంకరన్న

Posted: 11/25/2015 01:19 PM IST
After a long time again he is back with his unique type of comments

వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటమిపై, గత ఎన్నికలలో సాధించిన మెజారిటీ తగ్గిపోవడంపై కాంగ్రెస్ స్పందించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో.. మీడియా ముందుకు వచ్చిన ఓ సీనియర్ నేత.. ఏంటేంటీ.. వరంగల్ ఉప ఎన్నికలో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు.. అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని కుండ బద్దలు కోట్టారు. ఇంతకీ ఆయన ఎవరు..? అనుకుంటున్నారా..? అయన మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు. సీఎం కిరణ్ కుమార్ క్యాబినెట్ లో మంత్రి సేవలందించిన శంకర్ రావు.. ఆ తరువాత తన ఛాంబర్ లో కుర్చీలు టేబుళ్లకు డబ్బులు ఇవ్వలేదని కిందే కూర్చోని నిరసన తెలిపిన స్వపక్ష ప్రతిపక్ష నేత... గుర్తుకోచ్చారా..?  ఓ హౌసింగ్ సోసైటీ తాలుకు భూమిని కబ్జా చేశారంటూ ఆయనపై కేసులు గట్రా పెట్టి లుంగీపైన ఆయనను పోలీసులు తీసుకెళ్లి మరీ అరెస్టు చేశారు. ఆ నేత ఇన్నాళ్లు మళ్లీ మీడియా ముందుకు వచ్చి.. వరంగల్ ఉప ఎన్నికలో ఓడింది కాంగ్రెస్ కాదని సర్వేనని చెప్పారు.

తాను సిట్టింగ్ ఎంపీగా వున్నా.. తనకు గత ఎన్నికలలో టిక్కెటు రానీయకుండా అడ్డుపడిన సర్వే సత్యనారాయణపై ఆయన కసి తీర్చుకునే అవకాశం కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. వరంగల్ ఉప ఎన్నికలలో ఆయన ఓటమిపాలవ్వడంతో మైక్ ముందరకు వచ్చాడు శంకర్ రావు. ఆయనేమన్నారంటే..సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే అతడిని ప్రజలు ఓడించారన్నారు. గత ఏడాది మల్కాజ్గిరి నుంచి  పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు డిపాజిట్ కూడా దక్కలేదని శంకర్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక వరంగల్ లో ఎలా గెలుస్తాడు,. అన్న విషయం మీరే చెప్పాంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు. సర్వే స్థానంలో స్థానిక నేత రంగంలోకి దిగివుంటే పరిస్థితి మారోలా వుండేదని శంకర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 1,56,311 ఓట్లు మాత్రమే వచ్చాయని.. గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్లు తగ్గడానికి కూడా కారణం అదేనని శంకర్ రావు వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : warangal by-election  shankar rao  sarve satyanarayana  

Other Articles