తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ స్టేట్ మెంట్స్ తో ఏకీభవించారు. అవును మీరు చదవుతున్నది నిజమే.. కేసీఆర్ మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి ఊ కొట్టారు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారేమో తాజాగా వరంగల్ ఎన్నికల తర్వాత ఫలితాల మీద మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు వ్యక్త గత విమర్శలకు దూరంగా ఉండాలని హితవుే పలికారు. వ్యక్తిగత విమర్శలు వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఒకరినొకరు వ్యక్తిగతంగా నిందించుకునే పద్దతిని ప్రారంభించిందే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్ ను , కొప్పుల ఈశ్వర్ ను తాను ఏనాడూ వ్యక్తిగతంగా దూషించలేదని రేవంత్ వెల్లడించారు. ఇక వరంగల్ లోక్ సభ ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా.. ప్రజలు కేసీఆర్ పై మరింత భారం పెంచారని రేవంత్ అభిప్రాయపడ్డారు.
వరంగల్ ఎన్నికల్లో ఓడిస్తే.. ప్రజా సంక్షేమాన్ని మొత్తానికే వదిలేస్తారేమోననే ఆలోచనతోనే వరంగల్ ఓటర్లు టీఆర్ ఎస్‌ను గెలిపించారని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని కానీ వాటిని నిజం చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదని కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు, బలిదానాలు చేసిన వారి తరఫున మాట్లాడితే అది తప్పా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చీప్ లిక్కర్ మీద ప్రశ్నించడం కూడా తప్పా అని నిలదీశారు. కాగా మీడియా మీద, ప్రతిపక్షాల మీద నెపాన్ని నెట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more