Anam Brothers getting ready to join TDP

Anam brothers getting ready to join tdp

Anama Bros, Anam narayan reddy, Anam Vivekananda Reddy, Anam brothers, Nellore, TDP, congress, AP, chandrababu Naidu

Anam RamNarayan Reddy and Anam Vivekananda Reddy will join into TeluguDesamParty on december fifth. Nara Chandrababu Naidu gave green signal to Anam brothers arrival.

పాతికేళ్ల తర్వాత టిడిపిలోకి ఆనం బ్రదర్స్

Posted: 11/26/2015 09:42 AM IST
Anam brothers getting ready to join tdp

అవును. చాలా కాలం తర్వాత తిరిగి సొంత గూటికి చేరుతున్నారు ఆనం సోదరులు. గతంలో తమ రాజకీయ ప్రస్థానాన్ని టిడిపి నుండి మొదలుపెట్టిన ఆనం సోదరులు తిరిగి తమ సొంత గూటికి చేరుతున్నారు.

తెలుగు రాజకీయాల్లో గతంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ఆనం బ్రదర్స్ ఇక సైకిల్ మీద సవారీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆయన సోదరుడు పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. డిసెంబర్ 5 తేదిన పార్టీలోకి చంద్రబాబు ఆనం సోదరులను పచ్చ కండువా కప్పి ఆహ్వానించనున్నారు.  అయితే ఆనం సోదరుల చేరికను జిల్లా తెలుగుదేశం పార్టీలోని కొంతమంది సీనియర్‌ నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ జిల్లాలో బలంగా ఉన్న వైకాపాను ధీటుగా ఎదుర్కొవాలంటే తెలుగుదేశం మరింత పుంజుకోవడంతో పాటు సైకిల్‌ స్పీడును పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాబు యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఆనం సోదరులకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా ఓడిపోవడం జిల్లాలో ఆత్మకూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆనంతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆనం రామ నారాయణరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఆనం వివేకా, ఆయన తనయుడు ఏ.సి.సుబ్బారెడ్డి మాత్రం అప్పుడప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొంటు వచ్చారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల దెబ్బతిందని రాష్ట్రంలో ఇప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ కొలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో మాజీ మంత్రి ఆనం టీడీపీ వైపు దృష్టి సారించారు.

1983లో ఆయన తొలిసారిగా శాసనసభకు టీడీపీ ఎమ్మెల్యేగానే అడుగుపెట్టారు. అప్పటి నుంచే బాబుతో కొంతకాలం సన్నిహిత సంబంధాలు కొనసాగినప్పటికీ ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీతో తిరుగులేని నాయకులుగా చలామణి కావడంతో వారు గత మూడు దశాబ్దాలుగా అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనం సోదరులు తెలుగుదేశం వైపు మొగ్గుచూపడం అందుకు సంబంధించి ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరపడం... బాబు కూడా దాదాపుగా అంగీకారం తెలిపారు.  అదే విధంగా జిల్లాలోని కొంతమంది సీనియర్‌ నాయకులు కూడా ఇదే విషయంపై బాబు చర్చించటం వారు కూడా ఆనం సోదరుల చేరికపై తమకేమి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఆనం రాంనారాయణ రెడ్డి ఆత్మకూరు బాధ్యతలు. ఆనం వివేకానంద రెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ బాధ్య్తలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles