AP CM Chandrababu Tour To Naravaripalli With Family

Chandrababu performs grandson s tonsure ceremony

chanrababu naidu, balakrishna, brahmani, nara lokesh, Chandrababu grandson Devansh, AP CM Chandrababu Family Tour To Naravaripalli, Chandrababu performs grandson's tonsure, Naravaripalli Nagalamma temple, Bhuvaneshwari, vasundhara

AP Chief Minister Chandrababu Naidu’s grandson Devansh's tonsure ceremony was performed at Nagalamma temple in Naravaripalli in Chittoor district on Friday.

నారావారిపల్లెలో పండగ వాతావరణం.. ప్రముఖుల రాకతో కోలాహలం

Posted: 11/27/2015 05:30 PM IST
Chandrababu performs grandson s tonsure ceremony

నారావారిపల్లెకు ప్రముఖుల రాకతో కోలాహలం ఏర్పడింది. తన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తలనీలాలు తీయించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు పలువరు సన్నిహితులు చేరుకోవడంతో గ్రామంలో సందడి మొదలైంది. చంద్రబాబు కుటుంబం నారావారి పల్లెలోని నాగాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మ ఆలయాన్ని గ్రామంలోని టీడీపీ శ్రేణులు పూలు, మామిడి తోరణాలతో అలకరించారు.. నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లె సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లకృష్ణ భార్య వసుంధర ఇతర బంధువులతో కలిసి గ్రామంలో పర్యటించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభించారు.  ఎప్పుడో కాని కలవని కుటుంబ సభ్యులు కలిసినా.. హైదరాబాద్ లో అవాసాలు ఏర్పాటు చేసుకున్న చోట తప్ప కనిపిస్తారు. అలాంటి దేవాంన్ష్ తలనీలాల కారణంగా తమ గ్రామానికి నారా, నందమూరి కుటుంబసభ్యలు రావాడం.. అందుకు తమ గ్రామాం అతిధ్యమివ్వడం పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా, నందమూరి కుటుంబసభ్యులందరినీ ఒక్కసారిగా చూడగలిగే బాగ్యం తమకు దక్కిందంటున్నారు నారావారిపల్లె ప్రజలు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Nara devansh  lokesh  brahmani  tonsure ceremony  

Other Articles