తమిళనాడులో కులాల కుంపటి.. స్టుడెంట్స్ లో అంతకంతకు పెరుగుతున్న వైషమ్యాలు. అక్కడి మీడియాలో వస్తున్న వార్తలు అక్కడి పరిస్థితిని మనకు కళ్లకు కడుతున్నాయి. నీది ఆ కులం కాబట్టి నువ్వు అక్కడ ఉండు.. నీది మన కులం కాబట్టి అలా ఉండాలి అంటూ చిన్న పిల్లలు, చదువుకునే వయసులోనే విష బీజాలను మనసులో నాటుకుంటున్నారు. ఒక్క స్కూల్ లో కాదు అంతకంతకు అన్ని స్కూల్లకు ఈ విష సంస్కృతి విస్తరిస్తోంది దాంతో మానవ హక్కుల కమీషన్ పరిస్థితి మీద స్పందించింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? మీరు ఏం చేస్తున్నారు..? అంటూ అక్కడి కలెక్టర్ ను ప్రశ్నించింది. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని సూచించింది. తమిళనాడులో కులంకు గుర్తుగా రంగు రంగు రిబ్బన్ లు ధరిస్తున్నారు. అంటే ఓ కులం వాళ్లు ఓ రంగు రిబ్బన్ ధరించాలి.. మరో రంగు వాళ్లు మరోరంగు రిబ్బన్ ధరించాలి అన్నట్లు. తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న కులాల కుమ్ములాటల గురించి మరిన్ని విషయాలు..
తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో కులాల చిచ్చు ఎంత తీవ్రంగా ఉందంటే అక్కడ స్కూళ్లలో విద్యార్దులు తమ కులాన్ని బట్టి రిబ్బన్ బాండ్ ధరిస్తారట. అక్కడ ఓబిసి,దళిత కులాల మద్య తీవ్రమైన వర్గ వైషమ్యాలు ఉన్నాయి.దానికి తగ్గట్లుగానే స్కూళ్లలో విద్యార్ధులు తమ నుదుటిపైన,మెడకు,చేతికి రిబ్బన్ లు ధరిస్తారు. వాటి రంగును బట్టి వారి కులం తెలిసిపోతుందట. ఇది మానవహక్కుల ఉల్లంఘన అని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఈ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రిబ్బన్ లు కట్టుకోవడం ద్వారా ఆయా కులాల వారు సమీకరణ అవుతుంటారట. అలాగే దళితులను వేరే చేయడానికి కూడా దీనిని వాడతారు.రిబ్బన్ బాండ్ల ఆధారంగా బలహీనులపై దాడులు జరుగుతుంటాయని చెబుతున్నారు.ఎరుపు, పసుపు, ఆకుపచ్చ,కాషాయ రంగుల బాండ్ లను వాడుతున్నారు. ఇలా అక్కడి విద్యార్థుల్లో కులల మీద ఇప్పటి నుండే పట్టింపులు మొదలుకావడం అందరికి ఆందోళన కలిగిస్తోంది. మరి ప్రభుత్వాలు అక్కడి పరిస్థితిని అదుపు చెయ్యకపోతే మరింత దారుణంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more