Centre offers Ramdev opportunity to develop island with lighthouse as yoga resort

Centre offers bumper offer to yoga guru baba ramdev

baba ramdev, BJP, black money, press conference, yoga guru, baba ramdev, black money, modi government, tax evaders, PM modi, union minister, nitin gadkari, andaman nicobar islands, yoga tourist spot, haryana brand ambassador, bidding

Central government has offered yoga guru Ramdev the chance to develop scenic island with a lighthouse and yoga on the beach.

యోగా గురువుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..!

Posted: 11/29/2015 01:02 PM IST
Centre offers bumper offer to yoga guru baba ramdev

యోగా గురువు రాందేవ్ దయాదాక్షిణ్యాలతోనే తాము అధికారంలోకి వచ్చామని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో వచ్చి రాగానే ఆయన పేరును పద్మ అవార్డుల జాబితాలో చే్ర్చారు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో.. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత హర్యానాలో బిజేపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన బాబా రాందేవ్ కు ఆక్కడి ప్రభుత్వం హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అప్పటికీ సంతృప్తి చెందన కేంద్రంలోని మోదీ సర్కారు తాజాగా బాబా రాందేవ్ కు బంపరాఫర్ ఇచ్చింది.

యోగాభ్యాసం అభివృద్దికి ఓ దీవిని అప్పగిస్తామని, అక్కడ సకల హంగులతో యోగా సెంటర్ ను నెలకొల్పడం ద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రమే యోగా గురు బాబా రాందేవ్ ను కోరింది. ఈ మేరకు షిప్పింగ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ స్వయంగా బాబాను కోరారు. ఐలాండ్ రిసార్టులో యోగా క్లాసులు, ధ్యానం, ఆథ్యాత్మిక బోధనలు తదితరాలతో విదేశీ టూరిస్టులను ఆకర్షించవచ్చని భావిస్తున్నామని పీహెచ్డీసీసీఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ వివరించారు. రాందేవ్ ఏ దీవిని కోరినా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.

అండమాన్, నికోబార్ పరిధిలోని నిన్ క్యూ దీవితో పాటు లక్షద్వీప్ లో భాగంగా ఉన్న మినీకాయ్ దీవిని ప్రతిపాదనల్లో ఉంచామని, ముంబై పోర్టు సమీపంలోని కన్హోజీ అంగ్రే, కన్యాకుమారి సమీపంలోని ముట్టమ్, పారాదీప్ దగ్గరున్న ఫాల్స్ పాయింట్ దీవులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఆయుర్వేద రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, వాటర్ స్పోర్ట్స్, హెరిటేజ్ కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. కాగా, యోగా సెంటర్ ఏర్పాటుకు రాందేవ్ బాబాను ఆశ్రయించిన కేంద్రం, మిగతా గుర్తించిన దీవుల అభివృద్ధికి బిడ్డింగ్ విధానాన్ని పాటించాలని ఆలోచిస్తోంది. ఇక మరోవైపు నరేంద్రమోడీ ప్రభుత్వంపై బాబా రాందేవ్ విమర్శలు గుప్పించిన తరువాతి రోజునే కేంద్రం ఆయనకు తాయిలంగా ఈ ఆపర్ ఇచ్చిందన్న విమర్శలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba ramdev  BJP  nitin gadkari  andaman nicobar islands  

Other Articles