దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. ఉగ్రవాదం మీద మండిపడుతూ.. ప్యారిస్ ఘటనను ఖండిస్తూ ఓ ఉగ్రవాది చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇండియాలో జరిగిన అతి దారుణ ముంబై దాడుల సూత్రధారిగా అనుమానిస్తున్న లష్కరీ-ఇ-తోయిబా మిలిటెంట్ గ్రూప్ నేత హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. కాగా హఫీజ్ సయీద్‌ను 2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారిగా ఇండియా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ముంబయి దాడుల నుండే ఉగ్రవాదులు స్ఫూర్తి పొంది పారిస్ ఘటనకు పాల్పడ్డారని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది రక్షణ రంగ నిపుణులు విశ్లేషించారు. నాటి ముంబయి దాడిలో 174 మంది చనిపోగా, నేటి పారిస్ ఉగ్రదాడిలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో లష్కరీ-ఇ-తోయిబా మిలిటెంట్ గ్రూప్‌ను నడుపుతున్న హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ న్యూస్ ఏజెన్సీ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ఇందులో హఫీజ్ సయీద్ ఇస్లామిక్ స్టేట్ దాడుల్ని ఖండిస్తూ...ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పారిస్ ఉగ్రదాడికి అక్కడి ముస్లింలను నిందించాల్సిన అవసరం లేదు. నిజమేమిటంటే.. పాశ్చాత్య దేశాలు సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ ఈ ఉగ్రదాడి చేసిందన్నది తెలుసుకోవాలని... ఇది తాను చెబుతున్నది కాదని. ఇస్లామిక్ స్టేట్‌ను పాశ్చాత్యదేశాలు సృష్టించి తప్పుచేశాయని...కొద్ది రోజుల క్రితమే బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ చెప్పారని వెల్లడించారు. పాశ్చాత్య దేశాల దాష్టికాలకు ఒకరూపమే 'ఇస్లామిక్ స్టేట్'. పాశ్చాత్యదేశాల సామ్రాజ్యవాదానికి అనుగుణంగా ఐఎస్ ఏర్పాటు జరిగింది. దీనిని ముస్లింలపైనే ప్రయోగిస్తున్నారు.. అని అన్నారు. మొత్తంగా తాను ముంబై దాడుల విషయంలో చేసిన దాని గురించి కాకుండా ప్యారిస్ దాడుల మీద మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more