హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలలోనూ తామ విజయం సాధిస్తామని ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలుపొందేందుకు కలసి వచ్చే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని నివాస గృహాల యజమానులకు త్వరలో తీపి కబురు అందనుంది.
గ్రేటర్ పరిధిలో సొంత నివాసాలు ఏర్పర్చుకున్న వారికి భారీ మొత్తంలో ఆస్తి పన్ను రాయితీ నజరానా ప్రకటించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. గ్రేటర్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే వసూలు చేయాలని గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన త్వరలో కార్యరూపం దాల్చనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 తర్వాత ఏ క్షణంలోనైనా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ లోగానే ఆస్తి పన్ను రాయితీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నివాస గృహాలపై రూ.1,200లోపు ఆస్తి పన్నుకు బదులు రూ.101 మాత్రమే విధించడంతో పాటు పనులకు అనుమతుల జారీ విషయంలో ఆర్థికపర అధికార పరిమితులు పెంచాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి బి.జనార్దన్‌రెడ్డి తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనల అమలుకు జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన వెంటనే జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండేళ్ల వరకు స్థానిక అవసరాలకు తగ్గట్లు ఇరు రాష్ట్రాలూ పాత చట్టాలకు సవరణలు జరుపుకోవచ్చని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటు ఆధారంగా జీహెచ్ఎంసీ చట్ట సవరణ సులువుగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,200 లోపు ఆస్తి పన్ను గల 5,09,187 గృహాల యజమానులకు లబ్ధి చేకూరనుంది.
వీరు ప్రస్తుత సంవత్సరంలో రూ.29.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా, పాత బకాయిలు రూ.57.99 కోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.87.39 కోట్ల పన్నులు మాఫీ కానున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెల్లించాలని ప్రతిపాదనల్లో కోరారు. ప్రస్తుతం రూ.600 లోపు ఆస్తి పన్ను ఉంటే పూర్తిగా మాఫీ చేస్తుండగా, ఈ పరిమితిని రూ.1,200కు పెంచి నామమాత్రంగా రూ.101 మాత్రమే వసూలు చేస్తారు. మరీ ఈ తాయిలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రేటర్ పీఠాన్ని అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more