ఛూ మంతర్ కాళీ.. ఇది జంతర మంతర మోళీ.. మాయా లేదు, మంత్రం లేదు.. యంత్రం లేదు, తంత్రం లేదు మొసం గీసం మొదలే లేదు.. మస్క గొట్టె సిట్కా ఏదో బయటెట్టేస్తే.. సరదా బోదూ... అంూ మాయలోడు చిత్రం లో హీరో రాజేంద్రప్రసాద్ పాడిన పాట. అయితే అక్కడ ఏ మాయలోడు లేడు. అయినా సరే మాయ జరిగింది. ఇంకా చెప్పాలంటే.. పాత తరం సినిమాల్లో మంత్రగాడు లేడు, మాయాల ఫకీరు కూడా లేడు. అయినా మాయ జరిగింది. అది ఎలా అన్నది అర్ధం కాక ఆ విచిత్రాన్ని చూసిన పలువురు ఇప్పటికీ అశ్చర్యంలో మునిగితేలుతున్నారు.
ఆ విచిత్రం ఏమిటనేగా మీ సందేహం.. ఉన్నట్టుండి నేలపై నడుస్తున్న కార్లు గాల్లోకి ఎగిరాయి. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది నిజం. చైనాలోని ఓ పట్టణంలో రహదారిపై వాహనాలు ఉన్నట్లుండి గాల్లో తేలాయి. మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వాటంతటవే పడిపోయాయి. అదినూ నిత్యం రద్దీగా వుండే రహధారిపై. వివరాల్లోకి వెళితే అది చైనాలోని బిజీగా ఉండే జింటాయి ప్రాంతంలో. అక్కడి రహదారి ఎప్పుడూ తీరిక లేకుండా రద్దీగా ఉంటుంది. గతవారం ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఓ దృశ్యం సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.
వేగంగా వచ్చిన వాహనం ఒకటి సరిగ్గా సిగ్నల్‌ను సమీపిస్తుండగానే ఉన్నట్లుండి అకస్మాత్తుగా గాల్లోకి లేచి పక్కనే ఉన్న వాహనం పై పడిపోయింది. ఆ వాహనం కూడా గాల్లోకి లేచి కిందపడగా.. దాని పక్కనుంచి వెళుతున్న వాహనం కూడా ఎవరో పైకి ఎత్తే క్రమంలో అటుఇటు కుదిపేసినట్లుగా రోడ్డుపై కదులుతూ ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ వాహానాల్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, అదృశ్య శక్తుల వల్ల ఆ వాహనాలు గాల్లోకి లేవలేదని, ఒక సన్నటి వైరు వాటికి అనుకోకుండా తగులుకోని ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మరెందుకు అలస్యం ఈ వీడియోను మీరు చూసేయండీ..
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more