కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూను సచి, సుచి పాటించి మడి కట్టుకున్న బ్రహ్మనోత్తముల చేత చేయిస్తారు. అయితే ఆనదిగా వస్తున్న ఈ అనవాయితీకి, లడ్డూ ప్రవిత్రకు భంగం వాటిల్లింది. సాక్ష్యాత్తు శ్రీవారికి మాంసాహారపూరితమైన లడ్డూలను నైవేద్యంగా పెట్టించారు కొందరు దుర్మార్గులు. తిరుమల కోండపై కొరవడిన నిఘా ఫలితంగా లడ్డూ కల్తీ అయిపోయింది. జంతువ్యర్థాలతో చేసిన నెయ్యితో ఇక్కడ లడ్డూలు తయారయ్యాయి. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేస్తున్నారు. విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలోని అడవి నెక్కలం ఊరు శివారులో ఉన్న ఓ తోటలో స్థావరం ఏర్పాటు చేసుకుని కల్తీ నెయ్యి తయారీ ప్రారంభించారు. పేరున్న కంపెనీ లేబుల్స్‌తో కల్తీ నెయ్యి ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.
ఈ ముఠా నాయకుడు ఆవుల ఫణికుమార్‌తో పాటు .. మరికొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా,. పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు బయటపడింది. జంతు వ్యర్థాలతో తయారుచేసిన డాల్డాతో తయారైన ఈ నెయ్యిని తిరుమల శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూ తయారీకి కూడా గతంలో పంపారనే ఆరోపణలు వస్తున్నాయి. 2013లో టీటీడీ... నెయ్యి కోసం.. ఆవుల ఫణికుమార్ ముఠాకు ఆర్డర్ ఇచ్చింది. లడ్డూ తయారీకి నెయ్యి కూడా సరఫరా అయ్యింది. అయితే టీటీడీ క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఆ నెయ్యిని తిరస్కరించామని టీటీడీ హెల్త్ విభాగం అధికారి స్పష్టం చేశారు.
పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారా లేదా అనేది నిర్థారణ కాలేదు. అయితే 2013 తరువాత వేరే కంపెనీ పేరుతో ఫణికుమార్ టీటీడీకి నెయ్యి సరఫరా చేశాడా ? తిరస్కరించిన నెయ్యి స్థానంలో మళ్లీ సరుకు పంపించాడా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకే తెలియాలి. ఇదిలా ఉంటే కల్తీ నెయ్యి ముఠా వెనుక ఎవ్వరున్నా వదిలే ప్రసక్తి లేదని మంత్రి దేవినేని ఉమ హెచ్చరించారు,. కల్తీ నెయ్యి ముఠా ఆట కట్టించాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ఈ మాఫియాలో ఎవరి హస్తం ఉన్నా వదిలిపెట్టేది లేదనీ, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లకు ఆదేశాలు ఇచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more