manjira water in dead storage level

Godavari water supplied to hyderabad instead off manjeera

Telangana government, Manjira waters, Water supply, drinking water, singore dam, himath sagar, osman sagar, singore water, himayath sagar, osman sagar

nearly for a half century and more the mangeera river had fullfilled the thirst of hyderabadis, now came to dead storage level.

నగరవాసులకు గోదావరి నీళ్లే దిక్కు.. మంజీరా రాదు..!

Posted: 12/02/2015 02:36 PM IST
Godavari water supplied to hyderabad instead off manjeera

సుమారుగా అర్థ శతాబ్దపు కాలంపైగానే హైదరాబాద్‌ వాసుల దాహార్తి తీర్చడంలో దోహదపడిన మంజీరా నది ఇక అలసిపోయానని చెబుతోంది. మంజీరా తొలి ఫేస్ సింగూరు డ్యామ్, రెండో ఫేస్ మంజీరా నుంచి యాభై ఏళ్ల తరవాత ఇవాళ జలాల సరఫరా నిలిచిపోయింది. ఈ జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి జలాలను మెదక్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలకు నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాజధాని హైదరాబాద్‌కు 1965 నుంచి సింగూరు (మంజీరా ఫేజ్-1), 1982 నుంచి మంజీరా జలాలు (మంజీరా ఫేజ్-2) జలాలు సరఫరా అవుతున్నాయి.

నాటి నుంచి నేటి వరకు ఎడతెరపి లేకుండా నగర ప్రజల దాహార్తిని తీరుస్తూ చివరకు డెడ్ స్టోరేజ్ లెవల్ కు నీటిమట్టం చేరుకోవడంతో ప్రభుత్వం మిగిలిన జలాలను జిల్లా ప్రజల సాగు, తాగు అవసరాలకు నిల్వ చేయాలని నిర్ణయించింది దీంతో ఒకేసారి 120 మిలియన్ గ్యాలన్ల జలాలకు కోత పడడంతో పలు ప్రాంతాలు తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నాయి. గనర ప్రజల దాహర్తిని తీర్చడంలో తమ వంతు కృషి చేసిన జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ లతొ పాటు కృష్ణా మూడు దశల ద్వారా జలమండలి సరఫరా చేస్తున్న మొత్తం 357 ఎంజీడీల నీటిలో 120 ఎంజీడీలకు కోత పడింది.

దీంతో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఆనంద్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, బోరబండ, కేపీహెచబీ, భాగ్యనగర్ సెక్షన్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడా, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బాలానగర్, చింతల్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన 600 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు జలమండలి ఈఎన్‌సీ సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాంతాలకు గోదావరి మంచినీటి మళ్లించి 28 ఎంజీడీలు నీళ్లను సరఫర చేస్తామన్నారు.
 
. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state government  Manjira waters  Water supply  drinking water  

Other Articles