ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులతో అమె రహస్యంగా కలసిన వీడియోలను అమె వారికి తెలియకుండా గోప్యంగా చిత్రీకరించిందని, ఓ కేసులో ప్రధాన నిందితుడు అరోపించాడు. దీంతో ఒక దిశలో సాగుతున్న విచారణ కాస్తా కొత్త మలుపు తీరుగుతోంది. ఇప్పటికే పీకల్లొతుగా ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాంధీ చుట్టూ మళ్లీ ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నిలకు వెళ్లనున్న కేరళ ప్రభుత్వానికి ఇది ఇరుకున పెట్టే అంశాంగా కూడా మారనుంది.
కేరళ సోలార్ ప్యానల్ స్కాంలో ఏకంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సహా ఆరుగురు ప్రముఖ నేతలంతా ఆ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సునితీ నాయర్ అనే ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు పట్టుబడ్డారని ఈ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించారు. సరితా నాయర్ అనే ఆ మహిళతో వాళ్లు విడివిడిగా ఉన్నప్పటి వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, సరితా నాయర్ మాత్రం రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని డిమాండ్ చేశారు.
కాగా రాధాకృష్ణన్ మాత్రం సునితా నాయర్.. నాయకులెవ్వరికీ తెలియకుండా ఈ వీడియోలు తీసిందని, అవి బ్లాక్ మెయిల్ కోసమో, లేదా ఆత్మరక్షణ కోసం తీసిందో తనకు తెలియదని సోలార్ స్కాంను విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద రాధాకృష్ణన్ చెప్పారు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సీఎం ఊమెన్ చాందీకి చూపించానని, ఆరోది మాత్రం స్వయంగా ఆయనే ఉండబట్టి చూపించలేదని అన్నారు. కమిషన్ అవసరం అనుకుంటే వాటిని అందిస్తానని చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more