ఇస్లామిక్ స్టేట్ ఉద్రవాదుల పేరు చెబితేనే యావత్ ప్రపంచం భాయందోళనకు గురవుతుంది. ఇటీవల వరుసగా పారిస్ సహా పలు దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు సృష్టించిన బీభత్సం ఘటనల నేపథ్యంలో వారంటేనే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ముందుకోచ్చి ధైర్యంగా యుద్దం చేసే ధైర్యంలేని ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలను బంధీలుగా చేసుకుని మారణహోమాలకు పాల్పడటం ఇటీవల జరుగిన ఘటనల్లో స్పష్టంమైంది.
ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ నాలుగు దేశాల అధినేతలు కలసినా. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై ఉవ్వెత్తున మండిపడుతున్నాడు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ.. ఆ దిశగా ఏకం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నాడు. దీంతో మోడీని, కేంద్రంలోని బీజేపిని టార్గెట్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్ ను తదుపరి టార్గెట్ గా ఎంచుకున్నారా..? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు అలుముకుంటున్నాయి. మరోమారు ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు తెగబడనున్నారా..? ఇందుకు ప్రణాళికలు రచించారా..? అన్న సందేహాలు భారతీయులను కలవరాన్ని పెంచుతున్నాయి. ఇందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు క్రితం రోజున చేసిన సంచలన ప్రకటనే కారణం. భారత్ పైనా యుద్ధం ప్రారంభిస్తామంటూ ఆ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రొటీన్ కు భిన్నంగా భారత్ లోని రాజకీయ పరిస్థితులను కూడా ఉగ్రవాదులు తమ హెచ్చరికల్లో ప్రస్తావించడం గమనార్హం. అంతేకాక ముస్లింలకు వ్యతిరేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపడుతున్నారని, ముస్లింలపైకి ప్రజలను ఉసిగొల్పుతున్నారని కూడా ఐఎస్ ఆరోపించింది.
ఈ మేరకు నిన్న తన అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ తదితర దేశాలపైనా దాడులు మొదలుపెడతామంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు ఈ మేరకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నానాటికీ పెరిగిపోతోంది. హిందూ సంస్థలకు ఆర్థికపరమైన అండ ఇస్తున్న కొన్ని సంస్థలు పెద్ద సంఖ్యలో ముస్లిం వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి.
భవిష్యత్తులో ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి’’ అని ఐఎస్ ఉగ్రవాదులు భారత్ లో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలను విశ్లేషించారు. ఈ నేపథ్యంలో భారత్ పై యుద్దానికి తాము సమరశంఖం పూరిస్తున్నామని హెచ్చరించారు. అయితే దొంగ దెబ్బ తీయడం కూడా యుద్దమేనా..? ఎదురుగా వచ్చి తలపడటం చేతకాని ఉగ్రవాదులు.. భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పలువురు బీజేపి నేతలు అంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more