కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లకు ఏమీ కనిపించవు. అయితే మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు అన్న వార్తలు వినీ.. వినీ అందరికి విసుగుకూడా పుట్టింది. కానీ తాజాగా ఓ మైనర్ ఓ మహిళ శవంతో తన కామవాంఛను తీర్చుకున్నాడన్న వార్త సంచలనం రేపుతోంది. దిల్లీలో ఓ మైనర్ తన స్నేహితుడితో కలిసి ఓ మహిళను నిద్ర మత్తులోనే అత్యాచారం చేసి.. తర్వాత ఆమెను చంపేశారు. తర్వాత శవం మీద కూడా పలుసార్లు అత్యాచరం చేశాడు.
మైనర్.. ఓ మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేయడమే కాదు ఆమెను గొంతు నులిమి హత్య చేసి మృతదేహంపై పదే పదే లైంగిక దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ముకుంద్ పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం ఢిల్లీ వాయువ్య ప్రాంతం ముకుంద్ పూర్లో నివసించే మైనర్ బాలుడు తన స్నేహితుడు అభిమన్యు(22)తో కలిసి ఈ దారుణం చేసినట్లు డీసీపీ విజయ్ సింగ్ తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు ఒకే ప్రాంతంలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న మైనర్ స్నేహితు డు అభిమన్యుతో కలిసి అత్యాచారం చేసి హతమార్చారు. మృతి చెందిన అనంతరం కూడా ఆమెపై లైంగింక దాడి చేశారని సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.
బాధితురాలు ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్‌లో వొకేషనల్ కోర్సు చేస్తోంది. ఆమె సోదరుడు విదేశాల్లో ఉంటుండగా, ఓ పని కోసం తమ సవ్ స్థలికి ( ఉత్తర ప్రదేశ్‌లో ఓ గ్రామం ) వెళ్లారు తల్లిదండ్రులు. ఇక మహిళ ఒంటరిగా ఉందని తెలుసుకున్న మైనర్ పథకం ప్రకారం టెరస్ మీద నుండి ఇంట్లోకి ప్రవేశించారు. నిద్ర పోతుందని నిర్ధారించుకున్న అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. మెలకువ రావడంతో ఆమె గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆమెపై మళ్లీ అత్యాచారం చేశారు. అనంతరం బైట ఎవరూ లేని సమయంలో ట్రక్‌లో మృతదేహాన్ని తీసుకుని వెళ్లి సమీపంలోని డంప్ యార్డ్ వద్ద పడేశారు. అక్కడ కూడా ఆ..శరీరాన్ని వదలకుండా మళ్లీ అత్యాచారం చేశారు. ఇంతలో సొంత గ్రామానికి వెళ్లిన తల్లిదండ్రులు మహిళకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో వాళ్లు ఇంటి పక్కన వాళ్లకు ఫోన్ చేసి విచారించగా వివరాలు తెలియలేదు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా అసలు విషయం బయట పడింది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more