చెన్నై ప్రజలు నరకబాధ అనుభవిస్తున్నారు. రోజుల తరబడి వర్షాలు తప్ప, మంచినీళ్లు ,ఆహారం, కరెంట్ లేకపోవడం.. ట్రాన్స్ పోర్ట్ స్థంభించిపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలు అందరికీ అందడంలేదు. కొన్నిచోట్ల మొదటి అంతస్తువరకూ నీట మునిగిపోయింది. ఎందరో నిరాశ్రయులు పునరావాసం అంతంతమాత్రమే.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలిత ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే కోసం ప్రధాని నరేంద్రమోదీ చెన్నై బయలుదేరారు. టెలిఫోన్ సర్వీసులు నిలిచిపోయాయి. వేలాది మంది ఇళ్లు విడిచి వేరే ప్రాంతాలకు దొరికిన రవాణా సాధనంతో బయలుదేరి పోతున్నారు.
Also Read: సహాయం కోసం ఎదురు చూస్తున్న చెన్నై
చెన్నైలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించే హృదయవిదారక గాధ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన తల్లి శవంతో దాదాపు 20 గంటలుగా సహాయం కోసం ఎదురు చూస్తోంది. అవును అక్కడి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలేదు. చెన్నైలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన తల్లి శవం పక్కనే కూర్చుని దాదాపు 20 గంటలుగా జాగారం చేస్తోంది. తనకు సహాయం చేయాలని సదరు మహిళ స్నేహితులను కోరడం, వారు మీడియాను అభ్యర్థించడంతో ఈ విషయం వెలుగుచూసింది. 'మా అమ్మ డయాలిసిస్ పేషెంట్. నిన్ననే ఆమె చనిపోయింది. కరెంట్ లేకపోవడంతో భౌతికకాయం చీకటిలోనే ఉంది. శవాన్ని శ్మశానానికి తరలించేందుకు దయచేసి ఎవరైనా వాహనం పంపించండి. ఇప్పటికే భౌతికకాయం పాడైపోయ్యే స్థితిలో ఉంది. నాకు సహాయం చేయండి' అని ఆమె వేడుకుంది. దీంతో కరిగిపోయిన ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం అందించారు.
Also Read: చెన్నైకి అండగా తెలుగు సినిమా స్టార్స్
కాగా చెన్నైలో పరిస్థితి మీద సమీక్షించిన.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెన్నై, తమిళనాడును కేంద్రం పూర్తిగా ఆదుకుంటుందని లోక్ సభలో ప్రకటించారు. కాగా మరో మూడు రోజులు వర్షాలు తప్పవని వాతావరణశాఖ పేర్కొంది. డిసెంబర్ 6 వరకూ విమానాశ్రయాన్ని మూసివేశారు. పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రైళ్లను దారిమళ్లించారు. ఎన్ డీఆర్ ఎఫ్ టీమ్ లు మాత్రం నిర్విరామంగా నీట మునిగిన ప్రజలను సురక్షితప్రాంతాలకు చేరుస్తున్నారు. చిత్తూరు, పిచ్చాటూర్ నుంచి డ్యామ్ ల నీరు చెన్నై వైపు పోకుండా చూస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో బోట్ లను పంపారు. అరక్కోణం ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రస్తుతానికి విమానాశ్రయంగా వాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more