దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్.. ఈ సిరీస్ లో తొలిసారి మూడొందలకుపైగా పరుగులు నమోదు చేసింది. ఒక ఇన్నింగ్స్ లో ఆటగాళ్లను ఆలౌట్ చేయడానికి దాదాపు రోజున్నర పట్టడం అంతా కూడా చిత్రంగానే అనిపిస్తోంది. గత మ్యాచ్ ల్లో మూడు రోజులు ఆట మాత్రమే చూసిన సగటు క్రికెట్ అభిమాని అయ్యో అప్పుడే అయిపోయిందా అన్న భావనకు లోనయ్యాడు. ఇక సఫారీల విషయానికొస్తే... హమ్మయ్యా ! టీమిండియాను ఎట్టకేలకు ఆలౌట్ చేశామని సంబరపడుతోంది.
ఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 117.5 ఓవర్లలో 334 పరుగులను సాధించింది. 231/7 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా మరో వందకు(103) పైగా పరుగులను సాధించి మిగతా వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా మానసికంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అజింక్యా రహానే(127; 215 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) తో అద్భుత సెంచరీ చేశాడు. లంచ్ విరామ సమాయానికి ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి, మరో 95 పరుగులను జత చేసిన టీమిండియా.. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆలౌటయ్యింది.
రహానే-అశ్విన్ ల జోడి సఫారీ బౌలర్లకు మరింత పరీక్షగా నిలిచింది. ఈ జోడి ఎనిమిదో వికెట్ కు 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్నినెలకొల్పడంతో టీమిండియా ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో సఫారీలపై మొదటి శతకాన్ని, భారత్ లో తొలి సెంచరీని సాధించిన రహానే.. తన దూకుడును మరింత పెంచాడు. డేన్ పీడిట్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు సాధించి మంచి ఊపులో కనిపించాడు. అయితే రహానే సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత మరో 27 పరుగులు చేసి ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.
ఆ తరువాత అశ్విన్(56; 140 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. ఉమేష్ యాదవ్(10నాటౌట్) తో కలిసి అశ్విన్ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 334 పరుగుల వద్ద అశ్విన్ తొమ్మిదో వికెట్ గా అవుటవ్వగా, వెంటనే ఇషాంత్ శర్మ డకౌట్ పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్ కు ఐదు వికెట్లు సాధించగా, డేన్ పీడిట్ కు నాలుగు వికెట్లు, తాహీర్ కు ఒక వికెట్ దక్కాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more