ajinkya rahane | century | virat kohli | captain innings | fourth-test | ferazshah kotla | south-africa | india

Ajinkya rahane gets another century in fourth test of south africa

India vs south africa,Live Streaming Information,virat kohli,ajinkya rahane,4th test,Watch live,India vs south africa live score,Ind vs SA,4th test live,Day 3 live score,Ind vs sa live

Captain Virat Kohli makes full use of early reprieve and together with Ajinkya Rahane puts on a century stand to extend India’s lead.

భారత్ భారీ అధిక్యం.. రెండో ఇన్నింగ్స్ 267 పరుగుల వద్ద డిక్లేర్

Posted: 12/06/2015 11:52 AM IST
Ajinkya rahane gets another century in fourth test of south africa

ధేశ రాజధాని ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో మరో శతకాన్ని నమోదు చేశాడు. రహానే(100 నాటౌట్ ;206 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సఫారీ బౌలర్లకు మరోసారి పరీక్షగా నిలిచి సెంచరీ సాధించాడు. దీంతో  సఫారీలపై వరుస ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రహానే .. స్వదేశంలో వరుసగా రెండు శతకాల్ని సాధించిన గుర్తింపు పొందాడు.  

రహానే సెంచరీ చేసిన అనంతరం టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 267/5 వద్ద డిక్లేర్ చేసింది.  దీంతో టీమిండియా ఓవరాల్ గా 480 పరుగుల ఆధిక్యం సాధించి.. సఫారీలకు భారీ లక్ష్యాన్నినిర్దేశించింది.
190/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఆదిలోనే విరాట్ వికెట్ ను నష్టపోయింది. జట్టు స్కోరు 211 పరుగుల వద్ద ఉండగా విరాట్ ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. విరాట్ కోహ్లి(88;165 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, అబాట్, తాహీర్ లకు తలో వికెట్ దక్కింది.  టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులు చేయగా, సఫారీలు 121 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ ముగించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  ferozshah kotla stadium  delhi  

Other Articles