మీరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు బాంబ్స్ గురించి మాట్లాడకూడదు.. న్యూడ్ బీచ్‌లో ఉన్నప్పుడు బూబ్స్ (వక్షోజాలు) గురించి మాట్లాడకూడదు’ ఇది అంతర్జాతీయ పర్యాటకుడు మార్క్ హాస్కెల్ స్మిత్ అనుభవంతో చెబుతున్న మాటలు. ఆసియాలో చాలా తక్కువ గానీ, యూరప్ దేశాల్లో న్యూడ్ బీచ్‌లు సర్వ సాధారణం. బర్త్‌డే సూట్లతో బీచ్‌కు వచ్చి సన్‌బాత్ చేయడం అక్కడి వారి హాబీ. ముఖ్యంగా ఆస్ర్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే వంటి దేశాల్లో చాలా న్యూడ్ బీచ్‌లు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అయితే న్యూడ్ సిటీయే ఉంది. దక్షిణ పారిస్‌లో గల కాప్ డి ఎడ్జ్ సిటీలో సెక్యూరిటీ ఫెన్స్ దాటితే ఇక అంతా నగ్నత్వమే. షాపింగ్, పోస్టాఫీస్, బ్యాంకింగ్, రెస్టారెంట్లు, వాకింగ్.. వేటికీ బట్టలు వేసుకోనవసరం లేదు.
కాగా, ఒక సంవత్సరం పూర్తిగా అంతర్జాతీయ పర్యటనలు చేసిన స్మిత్.. తన అనుభవాల ఆధారంగా రాసిన ‘నేక్డ్ ఎట్ లంచ్’ పుస్తకంలో న్యూడ్ బీచ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు గురించి రాశారు. బట్టలు విప్పేసి న్యూడ్ బీచ్‌లోకి ప్రవేశించిన తర్వాత చాలా డిగ్నిటీగా ప్రవర్తించాలన్నారు. ‘అక్కడి వారి వక్షోజాలు, అంగం సైజుల గురించి మాట్లాడడం కానీ, వాటిని తదేకంగా చూడడం గానీ చేయకూడదు. అక్కడ న్యూడిటీ అనేది శృంగారం కాదు కాబట్టి అలాంటి ఆలోచనలను దరి చేరనీయకూడదు. బట్టలు విప్పి మన దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోతే ఎవరైనా తుంటరులు పట్టుకుపోయే ప్రమాదం ఉంద’ని చెప్పారు. ఇక ముఖ్యంగా న్యూడ్ బీచ్‌లకు వెళ్లేటప్పుడు అసలు తీసుకెళ్లకూడని వస్తువు కెమేరా అట. ఎవరైనా కెమేరా లేదా మొబైల్ ఫోన్ పట్టుకుని బీచ్‌లో నడుస్తూంటే అక్కడ సేద తీరుతున్న వారు అసౌకర్యంగా ఫీలవుతారట.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more