ఎన్నో ఏళ్ల క్రితం నిధితో సహా సముద్రంలో మునిగిపోయిన నౌకను కనుగొన్నట్లు కొలంబియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ భారీ నిధికోసం 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధకుల వేట ముగిసింది. 300 ఏళ్లకు పైగా దాగిన రహస్యం బట్టబయలైంది. తాము మానవచరిత్రలోనే అత్యంత విలువైన నిధిని కనుగొన్నట్లు కార్టాజినా పోర్టు వద్ద ఆ దేశ అధ్యక్షుడు జుయన్ మాన్యుల్ సాన్ టోష్ ప్రకటించారు. అసలే బంగారంతో కూడిన నౌక.. అందులో 300 సంవత్సరాల నాటిది కావడంతొ యావత్ ప్రపంచం దీని మీద చర్చించుకుంటోంది. అసలు సముద్రంలో ఉన్న ఆ బంగారు నౌక గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ మ్యాటర్స్ మీ కోసం..
1708 జూన్‌లో పెరూ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన శాన్‌జోస్ గాలెన్ (బంగారు నౌక)ను మధ్యలోనే బ్రిటిష్ సైన్యం పేల్చివేసింది. తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్పెయిన్ రాజు ఫిలిప్-5కు సాయం చేసేందుకు ఈ నౌక వెళ్తున్నదని పసిగట్టి ఈ చర్యకు దిగింది. ఈ ఘటనలో నౌకలోని 600 మంది జలసమాధయ్యారు. సముద్రంలో మునిగిపోయిన వాటిలో ఇదే అత్యంత విలువైన నౌక. ఈ నౌక కోసం కొలంబియా ప్రభుత్వం సముద్రాన్ని జల్లెడపట్టింది. 300 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు నౌకను, అందులోని నిధులను కొలంబియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ, నేషనల్ నేవీ, విదేశీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వివరాలను కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యూల్ శాంటో మీడియాకు తెలిపారు. నౌకలో 11 మిలియన్ల బంగారు నాణేలు, ఇతర ఆభరణాలు ఉండి ఉండవచ్చన్నారు. త్వరలోనే నౌకను, దానిలోని నిధిని వెలికితీస్తామని చెప్పారు. కాగా ఇప్పుడు ఈ నిధి విలువ 2 బిలియన్ డాలర్లు 13, 000 కోట్లు ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more