Spurious liquor at Vijayawada bar kills six people

Spurious liquor at vijayawada bar kills six people

Vijayawada, Krishnalanka, Bar, Swarna Bar, Deaths, Cheap liquior, Malladi Vishnu

Six persons died and 15 others seriously fell ill after consuming illicit liquor at Swarna Bar in Krishna Lanka area in Vijayawada on Monday morning. The victims, who are said to be daily wage workers, allegedly consumed the adulterated liquor before going to the work. Soon after they consumed liquor, they fell ill and three persons died and 17 others hospitalized. Three persons died while undergoing treatment at the hospital and the condition of four other persons is said to be serious.

ITEMVIDEOS: కల్తీ మద్యంతో 6గురు మృతి.. విజయవాడలో విషాదం

Posted: 12/07/2015 03:10 PM IST
Spurious liquor at vijayawada bar kills six people

కల్తీ మద్యం ప్రాణాలను బలిగొంటోంది. విజయవాడలో మరో సారి కల్తీ మద్యం తన ప్రతాపాన్ని చూపించింది. కల్తీ మద్యం తాగి ఇప్పటికి ఆరుగురు మరణించినట్లు సమాచారం. మొత్తం 20 మంది మద్యం తాగి అస్వస్థకు గురైంది. ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలోనే ఇలా కల్తీ మద్యం విజృంభించడం మీద అప్పుడే విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా కల్తీ మద్యాన్ని నిర్మూలిస్తామని చెప్పుకునే నాయకులు కావాలనే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా దీనికి కారణమైన బార్ ను పోలీసులు సీజ్ చేసి, మద్యం శాంపిల్స్ ను సేకరించారు. పరీక్షల నిమిత్తం వాటిని ల్యాబ్ కు పంపించారు.

విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో నేటి ఉదయం వెలుగుచూసిన దారుణానికి కల్తీ మద్యం కారణం కాదని జీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. క్షణాల్లో మీడియాకు అందుబాటులోకి వచ్చిన మల్లాది విష్ణు బార్ తనది కాదని, తన బంధువులదని ప్రకటించారు. అయినా ఈ ఘటనకు కల్తీ మద్యం కారణం కాదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గుర్తు తెలియని కొందరు దుండగులు బార్ కు చెందిన వాటర్ కూలర్ లో ఏదో కలిపారని, ఈ కారణంగానే దారుణం చోటుచేసుకుందని ఆరోపించారు

ఈ కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ కూడా జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. కాగా, అంతకుముందు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైన బాధితులను వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పరామర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  Krishnalanka  Bar  Swarna Bar  Deaths  Cheap liquior  Malladi Vishnu  

Other Articles