Sachin Tendulkar asks first question in Parliament

Sachin tendulkar asks first question in parliament

sachin, Parliament, Sachin Tendlkar, Sachin in parliament, Mumbai, Mumbai Metro, sachin Questions

Sachin Tendulkar’s first involvement came through a written question to the Ministry of Railways. The Master Blaster received a written answer from Manoj Sinha, Minister of State for Railways. There was another query, to Ministry of Road Transport and Highways, on the changes in provisions for issuing of driving licences. Reply on the same is expected.

3 సంవత్సరాల్లో సచిన్ మొదటి ప్రశ్న..!

Posted: 12/07/2015 04:06 PM IST
Sachin tendulkar asks first question in parliament

క్రికెట్ రారాజుగా ఎంతో పేరున్న సచిన్ ఎంత మాట్లాడతారో అందరికి తెలుసు. ఆయన ఎన్నో విషయాల మీద నవ్వుతూ సమాధానమిస్తారు. అయితే ప్రస్తుతం క్రికెట్ ను వదిలి.. రాజ్యసభలో ఉన్నారు. నిన్నటి క్రికెట్ మైదనం కాదు.. మౌనంగా ఉండడానికి అందుకే రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ తన గళాన్ని విప్పారు. ఎంతో కాలంగా మౌనంగా ఉన్న సచిన్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. సచిన్ తొలిసారి తన సొంత నగరమైన ముంబైపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముంబై మెట్రో రైల్వేను ప్రత్యేక జోన్‌గా ఎందుకు ప్రకటించలేరని ఆయన రైల్వే శాఖను ప్రశ్నించారు.

కోల్‌కత్తా మెట్రోను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించిన తరహాలోనే ముంబైతో పాటు ఢిల్లీ, చెన్నై మెట్రోలను ఎందుకు ప్రత్యేక జోన్లుగా ప్రకటించ లేరని సచిన్ తన లేఖలో ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని సచిన్ అడిగారు. మూడు నగరాల్లో ఉన్న మెట్రో ప్రమాణాలు వాటిని ప్రత్యేక జోన్లుగా గుర్తించే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నించారు. లెజండ్ క్రికెటర్ అడిగిన ప్రశ్నకు రైల్వే సహాయమంత్రి మనోజ సమాధానం ఇచ్చారు. భారతీయ రైల్వేకు అనుసంధానమైన కోల్‌కతా మెట్రో సర్వీసులు భిన్నమైనవని మంత్రి తెలిపారు. మూడు మహా నగరాల్లో మెట్రో రైల్వే సర్వీసులు మెయిన్‌లైన్లతో అనుసంధానమై ఉంటాయని, కానీ కోల్‌కత్తాలో మాత్రం కేవలం మెట్రో సేవలే ఉంటాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్సు అర్హత అంశంలో ఎందుకు మార్పులు చేశారన్న మరో ప్రశ్నను కూడా సచిన్ సంధించారు. ఆ ప్రశ్నపై ఇవాళ రాజ్యసభలో సమాధానం ఇవ్వనున్నారు. డ్రైవింగ్ లైసెన్సుపై సచిన్ టెండూల్కర్ తన ప్రశ్నను కేంద్ర రోడ్డు రవాణా శాఖను సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sachin  Parliament  Sachin Tendlkar  Sachin in parliament  Mumbai  Mumbai Metro  sachin Questions  

Other Articles