ఫేస్బుక్లో సందేశాలు పంపుతూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూకే పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు సిమన్ డాన్క్జుక్, నెయిల్ కోలేలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు బెదిరింపు సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని క్రేయిగ్ వాల్లేస్ అలియాస్ మమమ్మద్ ముజాహిద్ ఇస్లామ్ అని గుర్తించారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్‌లు చేస్తున్న నిందితుడు ముజాహిద్ ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోనికి తీసుకున్నారు.
హెండన్ మేజిస్ట్రేట్ ఎదుట సోమవారం నిందితుడిని హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యూకే చేపట్టిన దాడులను ముమ్మరం చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఎంపీలపై బెదిరింపు చర్యలు అధికమయ్యాయి. గత గురువారం నాడు వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్ సాక్ష్యాధారంగా చేసుకుని ఆదివారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుడు ఏ పార్లమెంట్ సభ్యుడికి సందేశాలు పంపించాడన్న వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లండన్ నియోజకవర్గం సభ్యుడు అయితే కాదని మాత్రం స్పష్టంచేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more