సామాజిక మాద్యమం అందుబాటులోకి వచ్చిన తరువాత వాటి వల్ల అనేక సందర్బాల్లో మంచి జరుగుతున్నా.. పలు సందర్భాల్లో మాత్రం అంతకన్నా అధికంగా అతిగా దుష్ర్పచారం జరుగుతోంది. ఎవరో ఒకరు తొందరలో చేసిన పోస్టింగ్ పై కామెంట్లు, లైక్ లతో నెట్ జనులు స్పందనలు త్వరగానే చేరుకుంటున్నాయి. ఈ ధశలో అసలు ఎదుటి వారు పోస్ట్ చేసిన విషయం నిజమా..? అబద్దమా అని కూడా నిర్థారించుకోకుండా తమ స్పందనలు తెలియజేసి ఆనక చేతులు కాల్చుకుంటున్నారు. అసలు నిజం ఏమిటన్నది పక్కన బెడితే.. ఈ తొందరపాటు చర్యల వల్ల పలుమార్లు సత్యం సమాధి అవుతుంది. దుష్ప్రచారమే రాజ్యమేలుతుంది. మంచి చేయబోయి కొందరు అబాసుపాలవుతున్నారు. అయినా నెల్ జనులు మాత్రం ఇంకా తమ పంథాను మార్చుకోవడం లేదు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వద్ద ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కారు ప్రమాదానికి గురైన సందర్భంలో ఆయనకు సాయం చేయాల్సిన మనుషులు కనబడలేదు. కానీ ఆ వీడియోలను, ఫోటోలను తీసిన సోషల్ మీడియాలో క్షణంలో అప్ లోడ్ చేసిన నెట్ జనులు మాత్రం అనేక మంది కనబడ్డారు. దీనిపై ప్రకాష్ రాజ్ బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల చైన్న వరద బీభత్సాన్ని ప్రధాని మంత్రి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించగా, దానిని ఫోటో షాప్ లో కొత్త అర్థాలు వచ్చేలా నెట్ జనులు ఫోటోలను అప్ లోడ్ చేశారు. ప్రధాని అసలు ఏరియల్ సర్వే చేశాడా..? లేదా..? అనే అనుమానాలు కల్పించేలా చేశారు.
తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత పుదుచ్చేరి ఎంపీ వీ నారాయణస్వామితో చెప్పులు మోయించుకున్నారన్న విషయమై నెట్ జనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు నిజం ఏమిటన్నది నారాయణ స్వామి చెప్పినా.. నెట్ జనుల చెవికి ఎక్కడం లేదంటే.. వారెంత దారుణంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలియకుండా పోతోంది. తమిళనాడు, పుద్దుచ్చేరిలలో కురిసిన భారీ వర్షం. వరద ప్రభావిత ప్రాంతాలను రాహుల్ పర్యటించారు. మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో, నారాయణ స్వామి చెప్పులు పట్టుకుని వాటిని రాహుల్ కాళ్ల ముందు పెట్టగా, ఆయన వాటిని వేసుకుని నడుస్తూ వెళ్లినట్టు కనిపిస్తోంది.
కాగా, ఈ ఘటనను నారాయణస్వామి ఖండించారు. ఆయన బూట్లు వేసుకు వచ్చారని, వాటిని తొలగించి నీటిలో నడవడానికి ఇబ్బంది పడుతుంటే, తన చెప్పులు ఇచ్చానని, ఆయనపై గౌరవంతోనే అలా చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చెప్పులు మోసే సంస్కృతి లేదని నారాయణస్వామి అన్నారు. తన షూస్ ను ఆయనే పట్టుకు నడిచారని, కనీసం సెక్యూరిటీ గార్డులకు కూడా ఇవ్వలేదని వివరించారు. అయినా నెట్ జనులు నారాయణ స్వామి మాటలను పట్టించుకోవడం లేదు.. రాహల్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి.. అక్కడ విద్యార్థులను కలసినప్పుడు తీసిన ఫోటోలో రాహుల్ వేసుకున్నది చెప్పులు కాదు షూస్ అని అర్థమవుతున్నా.. కావాలని లేని రాద్దాంతాన్ని చేస్తున్నారు నెట్ జనులు. ఇప్పటికైనా సత్యాన్ని సమాధి చేయకుండా.. ముందు యధార్థాలను తెలుసుకోండి..
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more