Is Ajmal Kasab alive

Is ajmal kasab alive

Kasab, jmal kasab, Mumbai attacks, Terror attack on Mumbai, Pakistan, Mumbai attacks case

Prosecution in Mumbai 26/11 attack case faced embarrassment when a key witness turned hostile and said. that Ajmal Kasab, the lone gunman caught alive after the assault and later hanged, was alive. “Mudassir Lakhvi, the headmaster of a primary school in Faridkot, where Ajmal Kasab studied for three years told the court that he taught Kasab and he is alive,”

కసబ్ బ్రతికే ఉన్నాడట..!

Posted: 12/11/2015 08:24 AM IST
Is ajmal kasab alive

2008లో ముంబై దాడుల్లో పట్టుబడి, ఉరితీయబడ్డ ఉగ్రవాది అజ్మల్‌కసబ్ బతికే ఉన్నాడట. ఈ విషయాన్ని ఫరీద్‌కోట్‌లో కసబ్‌కు మూడేండ్లపాటు పాఠాలు చెప్పిన ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్ ముదస్సీర్ లఖ్వీ, 26/11 ముంబై దాడుల కేసును విచారిస్తున్న ఇస్లామాబాద్ కోర్టులో చెప్పాడు. నిజానికి కసబ్‌ను 2012 నవంబర్‌లో పుణె జైలులో భారత ప్రభుత్వం ఉరితీసింది. పాక్‌స్థాన్ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో బుధవారం జరిపిన భేటీలో ముంబై దాడుల కేసును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభించింది.

ముదస్సీర్ వ్యాఖ్యలతో కోర్టు సిబ్బంది కొంత అయోమయానికి గురయ్యారు. ఈ హెడ్‌మాస్టర్ ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ సొంత ఊరివాడు. హెడ్‌మాస్టర్‌పై అతని ఒత్తిడి ఏమైనా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 2014 మేలో జరిగిన విచారణలోనూ కసబ్ బతికే ఉన్నాడని కోర్టుకు ముదస్సీర్ తెలిపాడు. ఇండియాలో మరణశిక్షకు గురైన కసబ్, హెడ్‌మాస్టర్ వద్ద చదువుకున్న కసబ్ ఒక్కడేనా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మొత్తానికి ఆ హెడ్ మాస్టర్ చెప్పిన స్టేట్ మెంట్స్ తో మాత్రం కోర్ట్ లో అందరూ షాకయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kasab  jmal kasab  Mumbai attacks  Terror attack on Mumbai  Pakistan  Mumbai attacks case  

Other Articles