Call money cruel harrasment on ladies

Call money cruel harrasment on ladies

call Money, AP, Chandrababu Naidu, Chandrababu on Call money, Call Money in AP

Call money cruel harrasment on ladies. In Ap, Call money gang harrasing mentally and trying to harras physically also.

కోరిక తీరిస్తే... వడ్డీ కట్టేందుకు గడువు పెంచుతాడట..!

Posted: 12/16/2015 10:59 AM IST
Call money cruel harrasment on ladies

కాల్ మనీ.. కాలాంతకుల ఆగడాలు, దారుణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాత, కృష్ణ జిల్లా, అనంతపురం, కడపలలో వెలుగు చూస్తున్న కాల్ మనీ వ్యవహారంలో దారుణాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఏపిలో దాదాపు పది జిల్లాల్లో కూడా కాల్ మనీ దారుణాలు చోటుచేసుకున్నాయి. అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిని క్యాష్ చేసుకోవడమే కాకుండా ఆడవాళ్ల మానంతో వ్యాపారం చేస్తూ మానవత్వాన్ని మరిచిన కిరాతకుల వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా విశాఖకు చెందిన ఓ మహిళ తనతో కాల్ మనీ నిర్వాహకులు ప్రవర్తించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాలు వింటే నిజంగా కాల్ మనీ ముసుగులో ఎంత దారుణాలు జరుగుతున్నాయో అర్థమవుతాయి.

Also Read: కాల్ మనీ కేటుగాళ్లకు చంద్రబాబు అభయం..?
Also Read: కాల్ మనీ కథ ఇది.. ఆడవాళ్లతో ఆటలు

కాల్ మనీ కాటుకు బలైన.. బలికి సిద్దంగా ఉన్న వాళ్లు వారి ఆగడాలకు విసిగి.. మీడియా ముందుకు వస్తున్నారు. ధైర్ఘ్యం చేసుకొని పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. అయితే తాజాగా విశాఖ నగరంలోని 3వ వార్డు, పాత డెయిరీఫారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ రెండు బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆ బంగారం విడిపించేందుకు  లాసన్స్ బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారిని కలిశారు. దీంతో రామకృష్ణ 3 లక్షలు బ్యాంకులో కట్టి ఆమె బంగారాన్ని విడిపించాడు. అయితే ఆ బంగారంలో కొంత తన దగ్గరే ఉంచేసుకున్నాడు. దాన్ని ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బుకు నెలకు  వందకి 12 రూపాయల చొప్పున వడ్డీ తీసుకుంటున్నాడు. వడ్డీ బాగా పెరిగిపోయిందని వెంటనే చెల్లించాలని నాలుగు నెలలుగా ఆమెపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. తాను ఒకేసారి అంత సొమ్ము చెల్లించలేనని ఆమె చెప్పడంతో తన కోరిక తీరిస్తే గడువు పెంచుతానని వేధించడం మొదలుపెట్టాడు.ఇలా ఆమెను లైంగికంగా లొంగదీసుకోవాలని చూసిన రామకృష్ణ మీద తిరగబడింది ఆ బాధిత మహిళ. ఇలా ఒక్క మహిళ కాదు.. వెలుగులోకి రాని వేల మంది మహిళలు కాల్ మనీ కాటుకు బలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : call Money  AP  Chandrababu Naidu  Chandrababu on Call money  Call Money in AP  

Other Articles