Unknown person in leadies hostel

Unknown person in leadies hostel

Hostel, Khairatabad, Hydebad, Ladies Hostel

Unknown person in leadies hostel. In Hyderabad, Khairatabad, a unknown person tried to enter into a ladies hostel.

లేడిస్ హాస్టల్ లోకి దూరిన అతడు ఎవరు...?

Posted: 12/16/2015 09:53 AM IST
Unknown person in leadies hostel

లేడిస్ హాస్టల్ లో కలకలం రేగింది. ఎక్కడో మారుమూల కాదు.. హైదరాబాద్ లో అందునా రద్దీగా ఉండే ఖైరతాబాద్ ఏరియాలో ఉన్న ఓ హాస్టల్ లో చోటుచేసుకున్న ఘటన ఇది. ఖైరతాబాద్ లోని ఆల్ ఇండియా ఉమెన్స్ కమ్యూనిటీ వర్కింగ్ హాస్టల్ లో అర్ధరాత్రి కలకలం రేగింది. కొన్నాళ్లుగా ఓ ఆగంతకుడు హాస్టల్ లో దూకేందుకు ప్రయత్నిస్తున్నాడు. మంగళవారం అర్ధ రాత్రి కూడా అలాగే ఎవరో హాస్టల్ గోడదూకడానికి ప్రయత్నించగా హాస్టల్ లో ఉండే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నాలుగు నెలలుగా ఇలాగే ఎవరో అగంతకులు రాత్రిపూట భయం సృష్టిస్తున్నారని హాస్టల్ లోని వారు చెబుతున్నారు.

గతంలో కూడా ఓ యువకుడు ఇలాగే చొరబడితే అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 40 మంది యువతులు ఉండే హాస్టల్ కి కనీసం సెక్యూరిటీ గార్డును కూడా ఏర్పాటు చేయలేదని మహిళలు చెబుతున్నారు. గతంలో కూడా దీనిపై చాలా ఫిర్యాదులు చేసినా మేనేజ్ మెంట్ నుంచి స్పందన లేదని హాస్టల్ లో ఉంటున్న మహిళలు చెబుతున్నారు. ఇలా మహిళల హాస్టల్ కు భద్రత లేకుండా పోవడం పోలీసులకు సవాల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hostel  Khairatabad  Hydebad  Ladies Hostel  

Other Articles