Chandrababu Naidu came

Chandrababu naidu came

Chandrababu Naidu, AP, Call MOney, Cash for Vote, Liquior Mafia, Vijayawada

Chandrababu Naidu came. After becomes chandrababu Naidu as Chief Minister for AP, so many problems for the state and him self.

చంద్రబాబు వచ్చాడు.. కష్టాలు తెచ్చాడు

Posted: 12/16/2015 10:05 PM IST
Chandrababu naidu came

రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం వెళ్లలేదు అంటే ఇదేనేమో. అచ్చంగా చంద్రబాబు నాయుడుకు ఈ లైన్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే ముందు నుండి దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చంద్రబాబు నాయుడు తాజాగా కాల్ మనీ వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు విమర్శలపాలయ్యారు. అయితే దీని మీద నిజం మరోలా ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు ఈసారి కావాలనే ఇందులో ఇరుక్కున్నట్లు వార్తలు తేలతెల్లం చేస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడుకు వరుస పెట్టి కష్టాలు వచ్చి పడుతున్నాయి అన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా టైం బ్యాడ్ గా సాగుతోంది.

Also Read: కాల్ మనీ వివాదంపై కదిలిన జనసేన 

మొన్న ఓటుకు నోటు, నిన్న లిక్కర్ మాఫియా కారణంగా విజయవాడ స్వర్ణ బార్ లో అమాయకులు చనిపోవడం.. ఇక నేడు కాల్ మనీ వ్యవహారం. ఇలా మొత్తంగా చంద్రబాబు నాయుడు కష్ట కాలంలో పదవి చేపట్టారో లేదంటే.. చంద్రబాబు సిఎంగా పదవి చేపట్టిన తర్వాత కష్టాలు మొదలయ్యాయో మరి అర్థం కావడం లేదు. అయితే అన్ని అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు తప్పు ఉంది అని మాత్రం క్లీయర్ గా అర్థమవుతుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఆ తర్వాత తాజాగా లిక్కర్ మాఫియా చేసిన కల్తీ వల్ల విజయవాడలో అమాయకులు ప్రాణాలు వదిలారు. ముందు నుండి కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ లిక్కర్ మాఫియాను నియంత్రించడంలో విఫలమైది. ఇక ఇప్పుడు తాజాగా కాల్ మనీ వ్యవహారం.

Also Read: కోరిక తీరిస్తే... వడ్డీ కట్టేందుకు గడువు పెంచుతాడట..! 

విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం.. ఒక్క విజయవాడలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. కృష్ణా జిల్లా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉంది అని పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా పోలీసులు చేస్తున్న దాడుల్లో ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయి. వేలకు వేల ప్రాంసరీ నోట్ లు, కట్టల కట్టల బాండ్ పేపర్లు, తనఖాకు ఉంచిన ఆస్తుల పత్రాలు ఇలా ఎన్నో రకాల డాక్యుమెంట్లు కట్టలు కట్టలుగా లభించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఉండటం.. వారి వెనక చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలా మొత్తానికి చంద్రబాబు నాయుడు మీద వస్తున్న ఆరోపణలకు పరోక్షంగా ఆయనే కారణం. అయితే మొత్తం వ్యవహారం వల్ల ఏపికి చెడ్డ పేరు వస్తోంది. అది ఎలాగ అంటారా..?

Also Read: కాల్ మనీ కేటుగాళ్లకు చంద్రబాబు అభయం..? 

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఒకరిని కాదు ఇద్దరిని కాదు. వరుస పెట్టి.. కేంద్ర మంత్రులను కలిశారు. తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూనే.. అంత మందిని కలవాల్సిన అవసరం ఏంటి అని అందరూ కూడా ప్రశ్నించారు. అలా ఓటుకు నోటు కేసులో చిరవకు మోదీని కూడా కలిశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాల్ మనీ కేసు తీవ్ర సంచలనానికి తెర తీస్తోంది. మరి కాల్ మనీ ఎక్కడ జరిగింది..? అనే ప్రశ్నకు ఖచ్చితంగా ఇంకెక్కడ మొన్న ఓటుకు నోటు కేసు మీద పాపులర్ అయిన ఏపి అని చర్చించుకోక తప్పదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు కేరాఫ్ కష్టాలు అన్నట్లు మారారు.

Also Read: చంద్రబాబుకు బ్యాడ్ టైం.. కారణం అదే 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP  Call MOney  Cash for Vote  Liquior Mafia  Vijayawada  

Other Articles