Here how you can buy a Meizu m2 for Re1

Here how you can buy a meizu m2 for re1

Smart Phone, Smart mobile, Meizu Mobiles, Meizu m2, Mobile for one rupee, Snapdeal

Meizu, one of China’s top 10 smartphone and electronics manufacturers, on Tuesday announced the launch of its online contest in India, the winner of which can grab a Meizu m2 smartphone for just a rupee. “You can now be a proud owner of Meizu #aZm2for1 rupee! We are coming up with something really exciting for all our #aZMeizuFans tomorrow! Keep posted to our Facebook page for more,”

ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ !

Posted: 12/17/2015 04:02 PM IST
Here how you can buy a meizu m2 for re1

ఒక్క రూపాయికి కనీసం సింగిల్ టీ కూడా రాదు.. రూపాయికి ఇప్పుడు పెద్దగా విలువ లేదు.. కానీ తాజాగా ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.  స్మార్ట్ ఫోన్.. అది కూడా అన్ని ఫీచర్లు ఉన్న ఫోన్ తీసుకోవాలని అందరికి ఉంటుంది.. కానీ బడ్జెట్ మనల్ని అడ్డుకుంటుంది కానీ కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఉంది. తాజాగా ఓ  చైనా సంస్ధ ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ కంటెస్ట్ తెరపైకి తెచ్చింది. చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ మిజు.. ఎం2 పేరుతో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర రూ.6,999. దీనిని స్నాప్‌డీల్‌ ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉంది. 5అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌, 1.3 గిగాహెడ్జ్‌ క్వార్డ్‌కోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నెల్ మెమొరీ,  ఎల్ఈడీ ఫ్లాష్‌తో 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 2,500ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది.

ఈ మొబైల్ ప్రమోషన్ లో బాగంగా సంస్ధ ఓ ఆన్ లైన్ కంటెస్ట్ నిర్వహిస్తోంది. రూపాయికే ఫోన్‌ పొందాలంటే మీరు చెయ్యాల్సిందల్లా.. మిజు లోగో ఫోన్‌పై ఎక్కడ, ఎలా ఉంటే బాగుంటుంది..? అనేదాన్ని వూహించి పెయింట్‌ చేసి ఆ చిత్రాన్ని మిజు ఇండియా ఫేస్‌బుక్‌ పేజీలో #?m2for1 హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చెయ్యాలి.  ఈ నెల 15 నుంచి 21 వరకు ఈ పోటీ కొనసాగుతుంది. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేస్తుంది. అలా ఎంపికైన వారందరికీ రూ.1కే ఎం2 ఫోన్‌ని కంపెనీ అందజేస్తామని తెలిపింది. మరి మీరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smart Phone  Smart mobile  Meizu Mobiles  Meizu m2  Mobile for one rupee  Snapdeal  

Other Articles