Ysrcp Mla Uppuleti Kalpana slams chandrababu and lokesh

Uppuleti kalpana fires chandrababu and lokesh

Ysrcp Mla Uppuleti Kalpana, Call Money sex racket gang, Chief Minister Chandrababu, ys jagan mohan reddy, ysrcp, call money, tdp call money scam, call money scandal, call money sex racket, assembly winter sessions

Ysrcp Mla Uppuleti Kalpana alleges that call money culprits are being saved by AP government

‘బాబు కనుసన్నల్లోనే కాల్ మనీ, చిన్నబాబుకు సెక్స్ రాకెట్ తో సంబంధం’

Posted: 12/18/2015 01:36 PM IST
Uppuleti kalpana fires chandrababu and lokesh

కాల్‌మనీ వ్యవహరం మొత్తం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని, ఆయన కుమారుడు లోకేశ్‌కు  సెక్స్‌రాకెట్ ముఠాతో సన్నిహిత సంబంధాలున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో బాబు, చిన్నబాబులిద్దరూ తమ ఆత్మసాక్షిగా నిజాలను అంగీకరించాలని అమె డిమాండ్ చేశారు. ఈ దారుణలలో భాగమైనందుకు, తెలుగింటి ఆడపడచులను వ్యభిచార రోంపిలోకి బలవంతంగా దింపినందుకు తక్షణం చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ అర్థం-మానం కేసులో అమానవీయంగా వ్యవహరించిన బడాబాబుల్ని.. పార్టీ నేతలను వదిలేసి చిన్న వ్యాపారుల్ని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

మొత్తంగా ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందన్న సందేహం వ్యక్తమవుతోందన్నారు. అందుకే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిపై సభలో చర్చకు తాము సిద్ధమని ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో జరిగిన విధంగానే అసెంబ్లీలోనూ అంబేద్కర్ స్ఫూర్తిపై చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ.. మహిళల్ని ప్రలోభాలకు, ఆందోళనకు గురిచేస్తూ టీడీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles