Is she a woman chandrababu questions

Is she a woman chandrababu questions

Chandrababu naidu,. Roja, AP, Assembly, cal Money

Is she a woman chandrababu questions. Chandrababu naidu fired on YSRCP Leader Roja. He asked that is she woman or not.

రోజా... ఓ ఆడదా..? చంద్రబాబు నాయుడు

Posted: 12/18/2015 04:08 PM IST
Is she a woman chandrababu questions

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై విరుచుకుపడ్డారు. రోజా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ.. రోజా ఆడదేనా అని ప్రశ్నించారు. నేడు ఏపి అసెంబ్లీలో వాడివేడిగా సాగుతున్న సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల మీదనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అంటూనే.. జగన్ అండ్ కో మీద తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్్ పోడియం వద్ద వైసీపీ నాయకులు చేస్తున్న ాందోళనలో రోజా పాల్గొన్నారు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆమె నినాదాలు కూడా చేశారు.

ఆమె మహిళా..? ఆమె మాట్లాడే మాటల్లో సభ్యత ఉందా..? అసలు ఆమె ఆడదేనా..? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా.? సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి..? అని చంద్రబాబు నాయుడు రోజా మీద నిప్పులు చెరిగారు. ముందు సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. నిన్న రోజా కాల్ మనీ వ్యవహారం మీద మాట్లాడుతూ.. అదే చంద్రబాబు నాయుడు కూతురు కాల్ మనీలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల మీద అసహనాన్ని వెల్లగక్కుతూ.. చంద్రబాబు రోజా మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  . Roja  AP  Assembly  cal Money  

Other Articles