Police arrested Malladi Vishnu and his brother

Police arrested malladi vishnu and his brother

SIT, Cheap Liquior, AP, Chandrababu Naidu, Malladi Vishnu, Malladi

In the Cheap Liquior case, police arrested Ex-MLA Malladi Vishnu and his brother in the late night. SIT officials questions malladi and his family members.

కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్ట్

Posted: 01/08/2016 09:53 AM IST
Police arrested malladi vishnu and his brother

ఏపిలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ లను పోలీసలు అరెస్టు చేశారు. రాత్రి పూట వారిద్దరినీ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించి రెండు రోజులుగా మల్లాది విష్ణును సిట్ అధికారులు ప్రశ్నించారు. కృష్ణలంక స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణలంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనలో 31మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను నియమించింది.

అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ కోర్ట్ అంగీకరించకపోవడంతో... మంగళవారం అజ్ఞాతం నుంచి విష్ణు బయటకొచ్చారు. సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం విచారణ జరపాలని కోర్ట్ ఆదేశించడంతో.. కుటుంబసభ్యులతో కలిపి అతన్ని పలు రకాలుగా ప్రశ్నించారు. ఆ తర్వాత కుటుంబీకులను పంపించేసి... విష్ణు ఇచ్చిన సమాధానాలు.. అతని కుటుంబీకులు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ జరిపారు.

స్వర్ణ బార్ తో పాటు... విష్ణుకు చెందినవిగా చెబుతున్న బార్ల లావాదేవీలను, డిసెంబర్ 7న మిగిలిన బార్ల నుంచి మద్యం తీసుకొచ్చిన విషయాలపై ప్రధానంగా ప్రశ్నించారు. అయితే.. బార్ సిబ్బంది చెప్పిన వివరాలకు, విష్ణు ఇచ్చిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీంతో సిట్ అధికారులు సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో విష్ణును, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేయడంతో విష్ణు అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వదంతలు వ్యాపించడంతో అతని అనుయాయులు విచారణ జరుగుతున్న ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఇక ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... కృష్ణలంక పీఎస్కు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SIT  Cheap Liquior  AP  Chandrababu Naidu  Malladi Vishnu  Malladi  

Other Articles