Is it wonder or self defence

Is it wonder or self defence

Culture, Healing, Hindu culture, Hinduism, Healing power, Spirituality

Is it special or self defence. Many of ues facing some mental and physical problems. With the healing power every one can gain health. In our culture there is a unlimited ways to heal.

అద్భుతమా ... ఆత్మ పరిశీలనా?

Posted: 01/11/2016 04:31 PM IST
Is it wonder or self defence

మనల్ని ఎంతగానో మోటివేట్ చేసే కొందరు సద్గురువుల ప్రవచనాలు లోతుగా వింటుంటే, ఇదే ప్రశ్న కలుగుతుంది. మారుతున్న కాలం తో మనమూ మారుతూ ఒచ్చాం, కానీ , తిరిగి మన మూలాలను వాటి గొప్పతనాన్నీ అన్వేషించే దిశగా ప్రయాణం చేస్తున్నాం. అందుకే మంచి వినడానికీ, చెయ్యడానికీ, మొగ్గు చూపుతున్నాం. ఇదే క్రమంలో, వైద్య శాస్త్రానికన్నా కూడా, ఆధ్యాత్మిక ధర్మాన్ని అనుసరించి, మెడిటేషన్, యోగా, మోటివేషనల్ హీలింగ్ ద్వారా, మందులు లేని జబ్బులు సైతం నయం చేసుకునేందుకే చూస్తున్నాం.

వినిడానికి కాస్తంత వింతగా అనిపించినా, మనలో చాలామంది ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. మనిషి కనిపెట్టిన ఔషధ సేవనం కన్నా, సృష్టి మనకు అందించిన సెల్ఫ్ హీలింగ్ పద్ధతినే అనుసరిస్తూ ఉన్నాం.

క్యాన్సర్ వంటి వ్యాధులని సైతం, ఇలా నయం చేసుకోగలిగినప్పుడు, మనసుకీ, జీవన శైలికీ సమతుల్యాన్ని పాటించలేమా? మరి ఇందుకు, ధ్యానం, యోగాభ్యాసం తో పాటు ఇంకేం కావాలి?

పరుగుల జీవన శైలికి బదులు, ప్రశాంతమైన జీవన శైలిని అలవరుచుకోవాలి. సాధించాలి అన్న విషన్ అందరికీ ఉన్నా, కొన్ని తప్పనిసరి కారణాల వల్ల, తమ ధ్యేయం అయితే సగం అయినా పూర్తి కావచ్చు, లేదా పూర్తిగా అట్టడుగున పడిపోవచ్చు. ఇలా మనం అనుకున్నది జరగకపోయినా, మనం సంతోషం గా ఉండచ్చు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, మన అమ్మ... గ్రుహిణి గా ఉండి, మన బాగోగులు చూసుకోవడమే ఆమె ప్రపంచం. మనల్ని నడిపించే ఆమే, ఇంత చేసినా, "ఏం చేసింది పెద్ద" అన్న గుర్తింపే పొందుతుంది ఎక్కువ శాతం. అయినా కూడా, ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటె ఆమెకు "తృప్తి" గా జీవించడం ఎలాగో తెలుసు. ఈ తృప్తి, ఆమె ప్రేమించిన వారు ఆమెకు ఇవ్వకపోయినా, ఆ అమృత మూర్తి మనస్సు అటువంటిది కాబట్టి, సందర్భానికి అతీతంగా, ఆమె ఎప్పుడూ తృప్తిగా ఉంటుంది. ఇది అబద్ధం అయితే, మనం ఇంత సంతోషంగా ఉండం ఈనాడు.

కష్ట సుఖాలను ఒకే విధంగా చూసేంతటి పరిపక్వత మనం అలవరుచుకోవాలి. ఇది జరగాలంటే, దేనికీ అతిగా ఆశపడటం, అది దక్కదు అనిపించినప్పుడు అంతే అతిగా ఆవేశపడటం మానుకోవాలి. పని చేసుకుంటూ పోవాలి. అంతే .

మరో ముఖ్య విషయం. తెలియకుండానే, మనం, ప్రేమ పేరుతోనో, బాధ్యత పేరుతోనో, ఇతరులలో మార్పును నిరంతరం కోరుకుంటూ ఉంటాం. మనకేం కావాలో, అందుకు అనుగుణంగా మనమే ఉండనప్పుడు , ఇంక ఇతరులకు ఎలా సాధ్యం? అందుకే, ముందు ఎదుటివారు మనకు ఎంతవారైనా ఆశించడం మానెయ్యాలి.

పచ్చని వాతావరణం యెంత స్వచ్చంగా ఉంటుంది? ఇటు వంటి స్వచ్చత మన జీవన శైలిలో అనుక్షణం ఉండేందుకే మనం కృషి చెయ్యాలి.

ఎదుటి వారితో పోల్చుకోవడం, ఒక లోటు ని సమస్యగా చేసి చూడటం, ఆగని కోరికలకు అదుపు వెయ్యకపోవడం, ఎందుకు పరుగేడుతున్నామో తెలియకుండా పరుగు పెట్టడం, మనకు నచ్చినదీ - నచ్చనిదీ, భయం వల్లకానీ మొహమాటం వల్లకానీ, ఇతరులకు చెప్పలేక, మనస్సు చంపుకుని వారికి తగ్గట్టు ఉండలేక, సంఘర్షణ అనుభవించడం, భావోద్వేకాలని అదుపులో ఉంచుకోవాలని వృధా ప్రయాస చెయ్యడం, ఇవన్నీ, ఇలాంటివెన్నో, అసహనం వైపుకు మనల్ని లాక్కుపోతున్నాయి.

అందుకే యెంత సంపాదించినా, నిద్రలో జారుకునేతప్పుడు, ప్రసాంతతను జారవిడుచుకుంటున్నాం.

ప్రతీ అంశంలో నిర్ణయం మనసుతో ఆలోచించి తీసుకుంటూ, మనల్నీ, చుట్టూ ఉన్నవారినీ మన పరిధిలోనే ఆనందంగా ఉంచేలా చేస్తూ, స్వార్ధంగా ఆశించక జీవిస్తూ, ఆనందాన్నీ , లక్ష్యాన్నీ వేరు చెయ్యకుండా చూస్తూ, ఒక్క రోజు గడిపి చూడండి. ఆనందంగా ఉండటం మన హక్కు అని, ఆనందంగా ఉంటె మరింత ఆనందం మన సొంతం అనీ అర్ధం అవుతుంది!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Culture  Healing  Hindu culture  Hinduism  Healing power  Spirituality  

Other Articles