Chandrababu encourage cader to win GHMC Polls

Chandrababu encourage cader to win ghmc polls

chandrababu, GHMC, TDP, BJP, Nizam college, chandrababu Naidu, Chandrababu naidu in GHMC campaign

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Tuesday launched TDP-BJP alliance's campaign for Hyderabad municipal elections, promising to once again develop the city. Claiming credit for Hyderabad's progress as an information technology hub, Naidu, who is also the Telugu Desam Party chief, appealed to people to give power to TDP -BJP alliance in Greater Hyderabad Municipal Corporation (GHMC) to ensure that the city is put back on the path of development.

గ్రేటర్ కోటలో మన జెండా: చంద్రబాబు

Posted: 01/13/2016 08:49 AM IST
Chandrababu encourage cader to win ghmc polls

ఎంతో కాలంగా తెలంగాణకు దూరంగా ఉన్న ఏపి ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి పూనుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాగా హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ టిడీపీ-బిజెపి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపారు. గ్రేటర్ కోటలో టీడీపీ-బీజేపీ ఎగరేయాల్సిన బాధ్యత రెండు పార్టీల కార్యకర్తలదేనంటూ ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో కూటమి విజయానికి నాంది పలకాలని పలువురు నేతలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ-బీజేపీ ఎన్నికల శంఖారావం సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, జేపీ నడ్డా, సుజనాచౌదరి, తెలంగాణ బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్న ఈ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గ నిలిచారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన సభలో తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకునే యత్నం చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు, పై చేయి సాధించేందుకు యత్నిస్తోంది టీడీపీ-బీజేపీ కూటమి. 150 డివిజన్లలో ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీచేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాకున్నప్పటికీ ఎలాంటి విభేదాలు లేకుండా కలసి పనిచేయాలని టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  GHMC  TDP  BJP  Nizam college  chandrababu Naidu  Chandrababu naidu in GHMC campaign  

Other Articles