కప్పు చాయ్, ఒక సమోసా తింటే కడుపు నిండిన సంతృప్తి చెందే సామాన్యుడికి. రానురాను అవి కూడా అందని ద్రాక్షాగానే మారుతున్నాయి. సమోసా, కచోరిలు కూడా ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరిపోవడంతో.. వాటితో కడుపునింపుకునే సామాన్యులకు ఇప్పుడా పరిస్థితి కూడా లేదు. ఇక గాలి పీల్చి, నీరు తాగి అకలి దప్పికలను తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసమే అన్న నానుడి పోయి ప్రభుత్వాలు కేవలం పన్నులు విధించడం కోసమే.. సామాన్యులకు ఏ వస్తువును, తినుబండారాలను అందుబాటులోకి రానీయకుండా చేయడానికే అన్నట్లుగా మారుతున్నాయి
తాజాగా బిహార్‌లోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసా, కచోరీలను విలాస వస్తువుల జాబితాలో చేర్చి.. వాటిపై ఏకంగా 13.5శాతం పన్ను విధించింది అక్కడి ప్రభుత్వం. అభివృద్ధి అజెండాతో ముందుకుసాగుతున్న నితీశ్ సర్కార్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజలకు విజయోత్సవ కానుకను అందించారన్న వ్యంగ్యవిమర్శలు కూడా వినబడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం తగిన నిధులను పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించిన నితీష్ సర్కార్ ఏకంగా సామాన్యుల తినుబండారాలపై పన్నుపోటు విధించింది. ఇందులో భాగంగా విలాస వస్తువులపై 13.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.
కిలోకు రూ. 500 కన్నా అధికంగా ధర కలిగిన మిఠాయిలు, దోమల్ని నిరోధించే మస్కిటో కాయిల్స్ వంటివాటిని ఈ విలాస వస్తువుల జాబితాలో చేర్చింది. సీఎం నితీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిఠాయిలతోపాటు సాల్టీ ఆహార పదార్థాలైన సమోసా, కచోరీలపైనా 13.5 శాతం పన్ను విధిస్తున్నామని కేబినెట్ కోఆర్డినేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేశ్ మెహోత్రా తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల యూపీఎస్ వస్తువులపైనా ఈ విలాస పన్ను ఉంటుందని, ఇసుక, సౌందర్య సాధన ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, తలనూనె వంటివాటిపై కూడా 13.5శాతం పన్ను విధించనున్నామని ఆయన చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more