వివాహం జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక...అందుకే, ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే, స్థాయిని మించి ఖర్చు చేసి, అప్పులపాలయ్యేవారు కూడా కొందరుంటారు. అలాంటి వారందరికీ గుజరాత్ లోని గాంధీనగర్ లో తాజాగా వివాహం చేసుకున్న నూతన దంపతులు ఆదర్శంగా నిలిచారు. హల్దారు గ్రామానికి చెందిన నిషాద్ బాను వాజిఫ్ దార్ (22) కు రమీజ్ మొహ్మద్ తో జనవరి 10న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. దీంతో, వివాహంపై ఆమె తన అభిప్రాయం వెల్లడించగా, ఆమెకు చేదోడుగా ఉంటామని కాబోయే భర్త, తండ్రి భరోసా ఇచ్చారు. దీంతో ఆమె తనతో పాటు చదువుకున్న అందర్నీ వివాహానికి ఆహ్వానించింది. అలాగే నర్సరీ నుంచి ఎంసీఏ వరకు తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందర్నీ ఆహ్వానించింది.
సాదాసీదాగా వివాహం చేసుకున్న ఆమె, వివాహ తంతు ముగిసిన వెంటనే తనకు విద్యాబుద్ధులు నేర్పిన 75 మంది రిటైర్డ్ గురువులను దుశ్శాలువ, మెమెంటోతో సత్కరించింది. అలాగే గ్రామం నుంచి ఉన్నత విద్యనభ్యసించిన ప్రతి ఒక్కరినీ ఆమె సత్కరించింది. అనంతరం తనలాగే చాలా మందికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, తాను చదివిన పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని కోరుతూ పది లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. అనంతరం ఏర్పాటు చేసిన భోజనం కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఆమె ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించగా, తాను ప్రచారం కోసం ఆ పనులు చేయడంలేదని, దయచేసి అలాంటి ప్రయత్నం చేయవద్దని, భోజనం చేసి వెళ్లాలని కోరింది. ఆమె వివాహం ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారని, విషయం తెలిసిన ప్రతిఒక్కరూ ఆమెను అభినందిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more