Rahul gandhi fire on HCU student suicide

Rahul gandhi fire on hcu student suicide

Rahul gandhi, HCU, Hyderabad Central University, Rohith

AICC Vice President Rahul Gandhi fired on VC, Central Ministers on HCU Students suicide. He said that every student has the right to express.

రోహిత్ ఆత్మహత్యపై రాహుల్ ఎమన్నారంటే..

Posted: 01/19/2016 03:52 PM IST
Rahul gandhi fire on hcu student suicide

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి నాయకుడు రోహిత్ ఆత్మహత్య మీద తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటి దీని మీద ఎక్వైరే చేస్తోంది. కాగా వివిధ విద్యార్థి సంఘాలు. పలువురు నాయకులు కూడా హెచ్.సి.యుకు చేరుకున్నారు. రోహిత్ ఆత్మహత్య మీద కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. హెచ్.సి.యు చేరుకున్న రాహుల్ రోహిత్ చిత్రపటానికి నివాళి ఘటించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

దిల్లీ నుండి హైదరాబాద్ బేగంపేట చేరుకున్న రాహుల్ ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రోహిత్ కు నివాళి ఘటించిన తర్వాత రోహిత్ తో పాటు సస్పెండ్ అయిన విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. అసలు వర్సిటీలో ఏం జరిగింది, రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. యూనివర్సిటికి చెందిన విద్యార్థి మరణిస్తు కనీసం ఓదార్చే బాధ్యత కూడా వీసీకి లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులు ఎప్పుడైనా తన ఇంటి తలుపు తట్టవచ్చని కూడా వెల్లడించారు. వీసీ, హెచ్ఆర్డీ మినిస్టర్ వైఖరి వల్లే ఓ స్టూడెంట్ చనిపోయాడు అని అన్నారు. కేంద్రమంత్రి, వీసీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్యాయం బహిష్కరించటం వల్లే విద్యార్థులు ఆందోళనకు దిగారన్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా విద్యార్థులకు లేదా అని నిలదీశారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  HCU  Hyderabad Central University  Rohith  

Other Articles