రాజకీయాలు చేయడం.. రాజకీయాల ద్వారా ప్రయోజనాలు పొందడం అందరికి మామూలే. కానీ నాయకుడు అన్న వాడు ఎన్నటికీ రాజకీయాలు చేయరాదు.. ఎందుకంటే అతడే ముందుండి నడిపించాలి. కానీ మన చరిత్రలో మాత్రం అలాంటి నాయకులు ఎన్నో రాజకీయాలు చేసినట్లు తెలుస్తోంది. జాతిపితగా కొలుస్తున్న గాంధీ అంటే చాలా మందికి అభిమానం ఉండచ్చు కానీ కొంత మందికి మాత్రం అభిమానం అస్సలు లేదు.. పైగా అతడి రాజకీయాల మీద కోపం కూడా ఉంది. అలా గాంధీ చేసిన రాజకీయాలకు అణగదొక్కబడిన భరతమాత ముద్దు బిడ్డ, వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
నేతాజీ అంటే ఎంతో మందికి ఓ వీరుడు అన్న భావన.. ఆయన పేరు చెబితే భారతీయుడి యదలో ఉన్న వీరత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నేతాజీ అంటే అందరికి అదే ధ్యాస. అయితే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలాగైతే రాజకీయాలు చేసి... ఎదుటి వాడి ఎదుగుదలను తొక్కేస్తారో అలానే నాడు కూడా అదే జరిగింది. గాంధీ కనుసన్నల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి స్వాతంత్ర ఉద్యమ క్రెడిట్ దక్కకుండా రాజకీయం చేశారు. ముఖ్యంగా జాతిపిత గాంధీ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుంటారు. కానీ రాజకీయాలు అంటే ఏంటో గాంధీ నుండే నేర్చుకోవాలి అని అద్దంపట్టే ఎన్నో ఘటనలు చరిత్రలో ఉన్నాయి.
* రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్ వారి మీద పోరాటానికి దిగితే మనకు స్వాతంత్రం ఎంతో సులువుగా సిద్దిస్తుందని నేతాజీ సూచించారు. కానీ గాంధీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. బ్రిటీష్ వారి మీదకు యుద్దానికి వెళ్లడం లేదంటూ నాటి భారతజాతీయ కాంగ్రెస్ ను ఒప్పించారు. అలాకాకుండా గాంధీ మాట వినకుండా... నేతాజీ బాటలో నాడు పోరాటం చేసి ఉంటే రెండో ప్రపంచ యుద్దం సమయానికే మనకు స్వతంత్రం సిద్దించేది.
* నేసనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గాంధీ అనుచరుడు పట్టాభిసీతారామయ్యకు పోటీగా నేతాజీ పోటీ చేశారు. అది అతడికి కోపం తెప్పించింది. నేషనల్ కాంగ్రెస్ లో తిరుగులేదు అనుకున్న గాంధీకి అది పెద్ద షాకే. దాంతో నేతాజీ తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా గాంధీ కానీ నేషనల్ కాంగ్రెస్ కానీ మద్దతునివ్వలేదు.
* కాంగ్రెస్ యొక్క వైఖరికి విసుగెత్తిపొయిన సుభాష్ చంద్రబోస్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఉద్దేశ్యం వివిధ దేశాలలో బ్రిటిష్ వారి తరఫున పోరాడుతున్న భారతీయ సైనికులను సమీకరించి, వారితో బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడం. అలా సమీకరించిన భారతీయ సైనికులతో ఆయన "ఆజాద్ హింద్ ఫౌజ్" స్థాపించారు. కానీ నాడు దేశంలో ఎంతో కీలకంగా ఉన్న గాంధీ నేతాజీ గురించి కానీ, అతడి ాజాద్ హింద్ ఫౌజ్ గురించి కానీ పట్టించుకోలేదు. పైగా అడ్డంకులు సృష్టించారు అనే అపవాదు ఉంది.
* ఒకప్రక్క బ్రిటిష్ సైన్యంతో తలబడడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ సిద్ధమౌతున్న తరుణంలోనే గాంధీజీ 1942లో "క్విట్ ఇండియా" ఉద్యమానికి పిలుపునిచ్చారు. నిజానికి ఇలాంటి ఉద్యమం కోసం 1939లోనే నేతాజీ పట్టుబట్టారు. నిజానికి గాంధీగారి క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో అవసరమైనదే అయినప్పటికీ మొదలుపెట్టిన మూడు వారాలలోనే ఆ ఉద్యమం అణగారిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకి దాని ఊసులేకుండా పోయింది. నిజానికి క్విట్ ఇండియా ఉద్యమం పలు ప్రాంతాలలో వ్యాపించాల్సి ఉంది. మరి ఏం జరిగింది?
* 1956 అక్టోబరులో క్లెమెంట్ ఆట్లీ వెల్లడించిన వివరాలు నిజానికి మనకు స్వాతంత్రం రావడానికి గాంధీ బలమైన కారణం కాదని.. నేతాజీనే అని తెలుస్తుంది. కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొన్నేళ్ళు కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పాలనకు వచ్చిన ఇబ్బందీ లేదు. మరి ఏదో ఉపద్రవం ముంచుకొస్తునట్టు మీరెందుకు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు? ఇంత హడావిడిగా దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేయడానికి కారణం ఏమిటి?" అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’ ‘‘మరి గాంధీ ప్రభావం ఏమిలేదా?’’ అన్న ప్రశ్నకు ఆయన తడుముకోకుండా ‘‘చాలా తక్కువ’’ అని బదులిచ్చాడు!
* ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సర్ నార్మన్ స్మిత్ 1945లో సమర్పించిన ఒక రహస్య నివేదిక ఇలా పేర్కొంది: "ఆజాద్ హింద్ ఫౌజ్ కారణంగా ఉత్పన్నమౌతున్న పరిస్థితులు దేశంలో దేశంలో నెలకొన్న అశాంతిని గురించి హెచ్చరిస్తున్నాయి. భారత ప్రజలలోను, సైన్యంలోనూ ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల గల సానుభూతిని ఉపేక్షించడానికి వీల్లేదు."
* భారత సైనికుల నుండి ఉత్పన్నం కాబోయే తిరుగుబాటు గురించి చర్చించడానికి బ్రిటిష్ ఎమ్.పి.లు ఆ దేశ ప్రధాని క్లెమెంట్ ఆట్లీని 1946 ఫిబ్రవరిలో కలిసారు. ఆట్లీని కలిసిన బ్రిటిష్ ఎమ్.పి.లు ఏమన్నారో తెలుసా? "ఇప్పుడు మనముందు రెండే మార్గాలున్నాయి. మొదటిది భారతదేశాన్ని వదలిపెట్టి వచ్చేయడం. రెండవది భారతీయుల మనల్ని వెళ్లగొట్టే వరకు వేచిచూడటం. రెండవ దాని గురించి ఆలోచిస్తే భారతీయ సైనికులలో మన పట్ల గల విధేయతను విశ్వసించడానికి వీల్లేని పరిస్థితి. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఇప్పుడు భారత జాతికి ఆదర్శవీరులైనారు" అని.
నేతాజీ చేసిన పోరాటం దేశం ఎన్నిటికీ మరిచిపోదు. విజయమో వీర మరణమో అన్న నేతాజీ మాటలు ఇప్పటికే భారతీయుల గుండెల్లో ధ్వనియిస్తున్నాయి. చరిత్రలో నేతాజీ కి చెందిన పేజీలు చెరిగిపోయి ఉండవచ్చు లేదా కావాలని కొంత మంది కూడగట్టుకుని చెరిపి ఉండవచ్చు. కానీ నిజాలు ఎన్నిటికైనా ప్రజల ముందు రావాల్సిందే. నాడు గాంధీ, నెహ్రూ కలిసి చేసిన కుట్రలు ఎన్నో దేశానికి తెలియాల్సిన అవసరం లేదు కానీ నేతాజీ లాంటి ముద్దు బిడ్డకు సంబందించిన నిజాలు మాత్రం ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. అందుకే నేతాజీ ఫైళ్ల మీద గత కొంత కాలంగా తీవ్ర చర్చ సాగుతోంది.
నేను చివరి వరకు దేశం కోసం పోరాడాను.. ఇప్పుడు అదే దేశం కోసం ప్రాణాలు విడుస్తున్నాను. దేశం కోసం పోరాటాన్ని ఆపకండి.. ఎందుకంటే స్వేచ్ఛ మహా భారత మన ముందు ఉంది.. ఆజాద్ హింద్ వర్థిల్లాలి- అని నేతాజీ చివరగా అన్న మాటలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more