Ashok Chakra awarded posthumously to Lance Naik Goswami

Ashok chakra awarded posthumously to lance naik goswami

ashoka chakra, Ashok Chakra award, Lance Naik Goswami Republic Day

Lance Naik Mohan Nath Goswami of the Special Forces, who took part in back-to-back operations in Jammu and Kashmir which resulted in killing of 10 terrorists in 11 days before being martyred, was today posthumously awarded the Ashok Chakra, the country's highest peacetime gallantry award, by President Pranab Mukherjee. The award was received by Bhavna Goswami, widow of Goswami, at the country's 67th Republic Day.

లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామికి మరణానంతరం ‘అశోక్ చక్ర’

Posted: 01/26/2016 04:53 PM IST
Ashok chakra awarded posthumously to lance naik goswami

ప్రాణాలకు తెగించి టెర్రరిస్ట్ లతో పోరాడి, తమ టీమ్ లోని సైనికుల ప్రాణాలు కాపాడేందుకు బలిదానం చేసిన పారా కమాండో లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామికి మరణానంతరం ‘అశోక్ చక్ర’ ప్రకటించారు. రిపబ్లిక్ డే దినోత్సవంలో మోహన్ నాథ్ గోస్వామి తరుపున ఆయన సతీమణి భావన ఈ అవార్డు అందుకున్నారు. దేశంలో సైనిక దళాల్లో విశేష ప్రతిభచూపిన వారికి ఇచ్చే అత్యున్నత అవార్డు ‘అశోక్ చక్ర’. ఈ ఏడాది ‘అశోక్ చక్ర’ అందుకున్న ఏకైక విజేత లాన్స్ నాయక్ గోస్వామీ కావడం విశేషం.

జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా సమీపంలోని అడవుల్లో టెర్రరిస్ట్ లతో పోరాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ లో లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి ప్రాణాలర్పించాడు. తన బృందంలోని సైనికులను కవర్ చేస్తూ, ముందుండి టెర్రరిస్ట్ లపై కాల్పులు జరుపుతూ దూసుకువెళ్లాడు. యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో పదిమంది టెర్రరిస్ట్ లను మట్టుపెట్టిన లాన్స్ నాయక్ సెప్టెంబర్ 2 న టెర్రరిస్ట్ ల తూటాలకు బలయ్యాడు. కుప్వారాలోని హప్ హృదా అటవీ ప్రాంతంలో టెర్రరిస్ట్ లు దాగి ఉండగా వారిని తొలగించే కృషిలో గోస్వామి మరణించారు. గోస్వామి కి చెందిన 9 పారా ( స్పెషల్ ఫోర్స్) కు చెందిన సుబేదార్ మహేంద్ర సింగ్ కు కీర్తి చక్ర దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashoka chakra  Ashok Chakra award  Lance Naik Goswami Republic Day  

Other Articles