AP CM Chandrababu Naidu said that he started his political life from Hyderabad

Ap cm chandrababu naidu said that he started his political life from hyderabad

Chandrababu Naidu, Chandrababu, GHMC, Polls, TDP, NTR, TeluguDesamParty, Telangana

AP CM Chandrababu Naidu said that he started his political life from Hyderabad. Chandrababu Naidu campaigning in hyderabad fro GHMC Elections,.

రాజకీయ జీవితం హైదరాబాద్ లోనే: చంద్రబాబు

Posted: 01/29/2016 08:34 AM IST
Ap cm chandrababu naidu said that he started his political life from hyderabad

తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ ఉంటుంది.. నా రాజకీయ జీవితం హైదరాబాద్ లోనే ప్రారంభించా.. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అన్న తేడా లేకుండా అందరూ నన్ను అభిమానిస్తారు అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఆయనకు ఏం పని అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఎవరికీ భయపడదని అన్నారు. కేసీఆర్ ను అమరావతికి ఆహ్వానించినా, తాను కేసీఆర్ యాగానికి హాజరైనా.. అదంతా రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలనే ఉద్దేశ్యంతో చేసినవే అన్నారు. రాజకీయం వేరు, ప్రభుత్వాలు వేరని, పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లోను తాను రాజీపడనని చంద్రబాబు స్పష్టం చేశారు.

తాను ఎక్కడికో వెళ్లిపోయినట్ల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న నేతలంతా ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. వీళ్లా నన్ను విమర్శించేది అంటూ ఆవేశంగా మాట్లాడారు. తాను హైదరాబాద్ లోనే ఉంటానని, అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. తెలుగు దేశం పార్టీకి, తెలంగాణ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని ఎవరూ వేరు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ను అందరం కలిసి మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసిన వారిని ప్రోత్సహించాలని చంద్రబాబు ఓటర్లను కోరారు. తెలంగాణ రైతుల కోసం మహారాష్ట్రలోని జైలుకెళ్లి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీల నుంచి 26 కులాల తొలగింపు అన్యాయం అని చంద్రబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Chandrababu  GHMC  Polls  TDP  NTR  TeluguDesamParty  Telangana  

Other Articles