Chandrababu naidus wife Bhunaneshwaris vote for TRS

Chandrababu naidus wife bhunaneshwaris vote for trs

nara Lokesh, KCR, KCRs wife, Chandrababus Wife, GHMC

Telangana cm KCR said that Chandrababu Naidus wife Bhuvaneshwaris vote for TRS party. Then Lokesh counter to that statement.

చంద్రబాబు భార్య ఓటు TRSకు.. కేసీఆర్ భార్య ఓటు..?

Posted: 01/31/2016 02:10 PM IST
Chandrababu naidus wife bhunaneshwaris vote for trs

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్, టీడీపీలు పంచ్‌లు విసురుకుంటున్నారు. శ‌నివారం జ‌రిగిన టీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో చంద్రబాబు భార్య భువ‌నేశ్వరి కూడా త‌మ‌కే ఓటేస్తార‌ని ఆమేరకు ఆమె మాట ఇచ్చార‌ని కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. లోకేష్ కూడా కేసీఆర్ భార్యను తెర‌పైకి తెచ్చారు. లోకేష్ ఏమ‌న్నారంటే “మూడు రోజుల క్రితం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో ప‌నిచేసే వారు ఆయ‌న భార్యను క‌లిశారు. మేడ‌మ్ హైద‌రాబాద్‌లో అంద‌రూ టీడీపీకి ఓటేయ‌మంటున్నారు, ఏం చేయమంటారు అని అడిగారు. అందుకు మేడ‌మ్ ఎవ‌రికి ఓటేయాల‌న్నది త‌న‌కే అర్థం కావ‌డం లేద‌ని వారితో అన్నారు. క‌విత ఏమో ఎంఐఎంతో పొత్తు లేదంటారు, మా ఆయ‌నేమో పొత్తు ఉంది అంటారు. కేటీఆర్ భీమ‌వ‌రం వెళ్లి పోటీ చేస్తా అంటారు. ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు” అని కేసీఆర్ భార్య అన్నార‌ని లోకేష్ చెప్పారు.


హైద‌రాబాద్‌లో ఎక్కడికి వెళ్లినా టీడీపీ చేసిన అభివృద్దే క‌నిపిస్తోంద‌ని అందుకే కేసీఆర్ ప్రచారానికి రావ‌డం లేద‌న్నారు. త‌మ‌కు విశ్వన‌గ‌రం వ‌ద్దని కేవ‌లం మంచి నీళ్లు ఇచ్చి చెత్త లేకుండా చేస్తే చాల‌న్నారు లోకేష్. చంద్రబాబు మోదీకి కాల్ చేయ‌డంతో 50 వేల ఇళ్లు తెలంగాణ‌కు మంజూరు చేశార‌ని లోకేష్ చెప్పారు. కేసీఆర్ స‌భ చూస్తే త‌న‌కే న‌వ్వొచ్చింద‌న్నారు. ఉప్పు లేని కూర‌లాగా కేసీఆర్ స‌భ సాగింద‌ని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కుంభకర్ణుడిలా పాలనను గాలికొదిలి నిద్రపోతున్నాడని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ విమర్శించారు. తెలంగాణకు ఎన్ని ఇళ్లు కావాలని కేంద్రం అడిగితే కేసీఆర్ నిద్రపోతూ, దానికి సమాధానం చెప్పలేదని గుర్తు చేసిన ఆయన, ఆ కారణంగానే తొలుత కేంద్రం ఇళ్లను మంజూరు చేయలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా మోదీకి ఫోన్ చేసి తెలంగాణ ప్రజలను అన్యాయం చేయవద్దని చెప్పగా, అప్పటికప్పుడు 50 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ఘనత కచ్ఛితంగా ఎన్డీయే ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చిన లోకేష్, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara Lokesh  KCR  KCRs wife  Chandrababus Wife  GHMC  

Other Articles