Police surrounded Kirlampurdi

Police surrounded kirlampurdi

Kaapu, Kapu Reservations, Mudragada Padmanabham, AP, Kirlampudi

Ap on caste reservation fire. Kaapu leader Mudragada Padmanabham gave deadline to govt on reservations.

కిర్లంపూడిలో ఉద్రిక్తత... ముద్రగడ ఏం చేస్తారు...?

Posted: 02/04/2016 02:45 PM IST
Police surrounded kirlampurdi

కాపులకు రిజర్వేషన్ల కల్పించే అంశం ఏపిలో కాకరేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అటు పోలీసులు.. ఇటు ప్రభుత్వంలోని పెద్దలు భయపడుతున్నారు.  కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం విధించిన డెడ్ లైన్ ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే... రేపు ఉదయం 5 గంటలకు తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ ప్రభుత్వానికి దాదాపుగా అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో ఏపీలో... ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది.

మొన్నటి కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. నిన్నటికి నిన్న... డీజీపీ జేవీ రాముడు రాజమండ్రికి వెళ్లి పరీస్థితి సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కాపుల రిజర్వేషన్లపై ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే, తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు కిర్లంపూడిలోనే ముద్రగడ దీక్షకు దిగనున్నారు. దీంతో ఆ గ్రామాన్ని ఇప్పటికే పోలీసు బలగాలు చుట్టుముట్టేశాయి. భారీ సంఖ్యలో మోహరించిన బలగాలు దాదాపుగా ఊరిని దిగ్బంధించాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaapu  Kapu Reservations  Mudragada Padmanabham  AP  Kirlampudi  

Other Articles