David Headley | investigatation | Mumbai attacks | video conference

David headley investigated in mumbai through video conference

David Headley investigated, David Headley investigated in video conference, David Headley investigation, David Headley attacks, David Headley latest news, David Headley videos, David Headley

David Headley investigated in Mumbai through video conference: Terrorist David Coleman Headley, testifying through videoconferencing. David Headley deposes before Mumbai court, says two attempts failed.

వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ... దాడులపై వివరాలు

Posted: 02/08/2016 12:59 PM IST
David headley investigated in mumbai through video conference

ముంబై దాడుల కేసులో దోషిగా తేలిన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో హెడ్లీపై ముంబైలోనూ అతడిపై కేసు నమోదయ్యింది. అప్రూవర్ గా మారితే శిక్ష నుంచి విముక్తి లభిస్తుందని భారత్ చెప్పిన ఆఫర్ కు హెడ్లీ దిగొచ్చాడు. ఈ దాడులపై గల నిజానిజాలు వివరించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఈరోజు ఉదయం అమెరికాలోని జైలు నుంచి అతడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని న్యాయమూర్తి ముందు తన నేరాన్ని అంగీకరించాడు.

ముంబైపై ఉగ్రదాడికి ముందు రెండు సార్లు అదే విధమైన దాడులకు ప్రయత్నించి విఫలమైనట్టు హెడ్లీ తెలిపాడు. ఈ రెండు దాడులను కూడా లష్కరే తోయిబా ప్లాన్ చేసిందని, అయితే అనుకున్నట్టు జరగక చివరి నిమిషంలో రద్దు చేసుకుందని హెడ్లీ వెల్లడించాడు. తొలి దాడికి సెప్టెంబర్ 2008లో ప్లాన్ జరిగిందని, ఓ బోటు ముంబై తీరానికి సమీపంలో రాళ్లను ఢీకొని ఆయుధాలను, పేలుడు సామాగ్రినీ కోల్పోయిందని, ఉగ్రవాదులు మాత్రం బతికిపోయారని వెల్లడించాడు.

ఆ తర్వాత అక్టోబరులో కూడా ఇదే విధమైన దాడికి ప్రయత్నం జరిగిందని.. కానీ ఆ దాడి ఎందుకు విఫలమైందో మాత్రం చెప్పలేదు హెడ్లీ. "లష్కరే తోయిబాకు నేను నిజమైన అభిమానిని. నేను ఇండియాకు తొలిసారి రాకముందే వారు చేయాలనుకుంటున్న దానిపై నాకు పూర్తి సమాచారం తెలుసు" అని హెడ్లీ కోర్టుకు వెల్లడించాడు. లష్కరే ప్రతినిధి సాజిద్ మీర్, తనను ఇండియాలో వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరాడని, ముంబై నగరం వీడియోను అడిగాడని కూడా హెడ్లీ కోర్టుకు చెప్పాడు. తాను వీడియోలు తీసి పంపానని, టెర్రరిస్టులు వాటిని వాడుకుని దాడులు చేశారని చెప్పాడు.

ఈ కోర్టు విచారణలో మొదటిరోజున తన అసలు పేరు దావూద్ గిలానీ అని, 2006లో డేవిడ్ హెడ్లీగా మార్చుకున్నానని తెలిపాడు. పాకిస్థాన్ నుంచి భారత్ కు తాను 8సార్లు వచ్చానని అంగీకరించాడు. ఈరోజు జరిగిన విచారణలో దాదాపు 45 ప్రశ్నలకు హెడ్లీ సమాధానాలు చెప్పినట్లుగా తెలిసింది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Headley  investigatation  Mumbai attacks  video conference  Mumbai court  

Other Articles