LEOPARD | ATTACK | VIBGYOR SCHOOL Bangalore | Injured | Video

Again leopard attack in bangalore school

Leopard Attack in Bangalore school, Leopard Attack in Bangalore, Leopard in Bangalore school, Leopard Attack in school, 6 peoples injured in Bangalore school, Leopard Attack injured

Again Leopard Attack in Bangalore school: Leopard attacks forest officials in VIBGYOR high school Marathahalli Bangalore.

చిరుతలకు ఆ స్కూల్ తెగ నచ్చినట్లుంది

Posted: 02/10/2016 10:01 AM IST
Again leopard attack in bangalore school

బెంగళూరు మరథహల్లిలోని విబ్ గ్యార్ అనే స్కూల్ లో రెండు రోజుల క్రితం ఓ చిరుత పులి తెగ హడావిడి చేసి, ఆరుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. చిరుతలకు ఆ ప్రదేశం బాగా నచ్చిందో మరి ఏమనిపించిందో తెలియదు కానీ... అదే స్కూల్లోకి మరో చిరుత మంగళవారం ప్రవేశించింది.

ఒక చిరుత అక్కడకు వచ్చిన విషయం ఖచ్చితంగా చెప్పగలనని, కానీ స్థానికులు మాత్రం తాము రెండు చిరుతలను చూసినట్లుగా చెబుతున్నారని అటవీ శాఖాధికారి ఒకరు చెప్పారు. మంగళవారం ఉదయం 9-10 గంటల మధ్యలో చిరుత వచ్చిందన్నారు.

చిరుతను పట్టుకోవడానికి రాత్రిసమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసేది లేదని ఆయన స్పష్టం చేసారు. స్థానికులంగా తమ ఇళ్ల తలుపులు, కిటీకిలు గట్టిగా వేసుకొని, జాగ్రత్తగా వుండాలని అటవీ శాఖాధికారి సూచించారు. అయితే ఉదయం సమయంలో చిరుతను పట్టుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తామన్నారు.

స్కూల్లో చిరుత ఎక్కడుందో తెలియకపోయవడంతో బుధవారం స్కూలుకు సెలవు ప్రకటించారు. ఇలా చిరుత జనసంచార ప్రదేశంలో హల్చల్ చేస్తుంటే జనాలు బెంబెలెత్తిపోతున్నారు. అటీవీ శాఖాధికారులు చిరుతలను పట్టుకోవడానికి తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard Attack  Bangalore  school  Injured  News  

Other Articles