రెండు రోజుల క్రితం భారత్ లోని బెంగళూరులో జనారణ్యంలోకి వచ్చిన చిరుత పెద్ద ఎత్తున అలజడి సృష్టించి.. ఆరుగురిని గాయపర్చి.. పలాయనం చిత్తగిత్తగా, అటు ఆఫ్రికాలోని కెన్యాలో కూడా చిరుత పర్యాటకులకు చుక్కలు చూపించింది. కెన్యాలోని మారా జాతీయ రిజర్వు పార్కులో ఓ చిరుత పరుగుపరుగున ఎదురువచ్చి.. పర్యాటకుల సఫారీ జీపుపై ఉరికి ఎంతో ఆనందంగా వారిని చూస్తూ కూర్చుంది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన పర్యాటకులు పట్టపగలు చుక్కలు చూశారు. సుమారు గంటపాటు వారి ఓపికను పరీక్షించిన చిరుత చివరకు తనంతట తానుగా జీపు దిగి.. దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
వివరాల్లోకి వెళ్లే.. కెన్యాలోని మారా నేషనల్ రిజర్వ్ లో ప్రయాణికుల సఫారీ కారును అడ్డుకున్న చిరుత దాదాపు గంటపాటు వారిని కదలనీయలేదు. అయితే జీపులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టలేదు. చిరుత ఉన్నంతసేపు వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూశారు. ఆ తరువాత కోలుకుని పర్యాటకులు తీసిన మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మసాయ్ మారా రిజర్వ్ పార్కునుంచి ఓపెన్ టాప్ సఫారీ కారు ప్రయాణిస్తుండగా ఉన్నట్లుండి కారుపైకి చిరుత ఎక్కడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ముందుగా పక్కనే ఉన్న గడ్డిలోంచి ప్రత్యక్షమైన ఆ అడవి మృగం... కుడిపక్కనుంచి జీపుఎక్కి పర్యాటకుల కెమేరావైపు తేరిపార చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడే ప్రశాతంగా కూర్చుండిపోయింది. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కారులోని పర్యాటకులు తమ భయాన్ని పంచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరుత వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. అమ్మో గుండె ఎంత స్పీడుగా కొట్టుకుందో అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.
45 నిమిషాలపాటు ఊరుకున్న టూరిస్టు గైడ్ ఇక లాభం లేదని.. చిరుత కదిలేలా లేదని తమ వాహనం ఇంజిన్ ను మెల్లగా స్టార్ట్ చేశాడు. దీంతో అప్పటిదాకా తీరిగ్గా కూచున్న చిరుత పులి పెద్దగా కాళ్ళు చాచి ప్రయాణీకులవైపు చూసింది. ఒళ్ళు విరుచుకొని కారు ముందుకు దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎట్టకేలకు ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీడియో ముగుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more