మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసే వాడు.. చేస్తూనే ఉంటాడు... తప్పు మోసం చేసే వాడిది కాదు... మోసపోయే వాడిది- అని తెలుగు సినిమాలో ఓ హీరో చెప్పిన డైలాగ్. అయితే సినిమాలకు పాటిలిక్స్ కు విడదీయలేని అనుబందం ఉంది అని అందరికి తెలుసు. అయితే సినిమా డైలాగులు చాలా సార్లు పాలిటిక్స్ లో పనికివస్తాయి. ఎన్నికల టైంలో ఏదిపడితే అది వాడడం.. తర్వాత నేనేనా.. అది మాట్లాడింది.. అలా చెప్పానా..? గుర్తు లేదులే..! అనే టైప్ లో చాలా మంది పొలిటీషిన్లు తయారయ్యారు. మాట కోసం ప్రాణాలిస్తాం.. మాటపోతే ప్రాణంపోతుంది.. అని సినిమా డైలాగులు బాగా వల్లెవేసే మన నేతాగణం ఎంత వరకు మాట మీద ఉంటారో అందరికి తెలుసా..? మరి నిజానికి ప్రతిసారి మాట ఇవ్వడం.. వాటిని తప్పడం మామూలే అయింది కదా... గొర్రెలు ఎవరు అన్నది ప్రశ్న. మాట ఇచ్చే వాళ్లు గొర్రెలా..? లేదంటే మాట వినే వాళ్లు గొర్రెలా..?
నేను గెలిస్తే.. హైదరాబాద్ కు సముద్రం తీసుకువస్తాను.. అందరూ ఆ సముద్రం బీచ్ దగ్గర సేద తీరొచ్చు.. నాకు ఓటు వేసి గెలిపించండి. నేను ఆ పని చేస్తాను అని ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చెప్పే డైలాగ్. కానీ ఇలా చాలా మంది రియల్ పొలిటికల్ లీడర్లు హామీలు ఇస్తారు.. వాటిని మర్చిపోతారు. లేదంటే పలానా పార్టీ వాళ్లకు అన్ని సీట్లు వస్తాయి.. అన్ని సీట్లు వస్తే నేను తొడగొడతా.. అవసరమైతే పడగొడతా అంటూ మీసం మెలేసి బరిలోకి దిగుతుంటారు. కానీ రియాల్టీకి వచ్చేసరికి దాన్ని మరిచిపోతుంటారు. అలాంటి వాళ్లలో చాలా మంది నేతలే ఉన్నారు.. వాళ్ల కథేంటో ఒక్కసారి చూడండి.
కేసీఆర్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించే టైంలో అయ్యవాళ్లు నోటికి వచ్చినంత మాట్లాడేశారు.. కానీ తర్వాత మాత్రం తూచ్.. అలాంటిదేమీ లేదు.. అది కష్టం అని అన్నారు. ఇంతకీ అయ్యగారు ఏమన్నారో తెలుసా..? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అని హామీ ఇచ్చారు. కానీ తర్వాత దళిత ముఖ్యమంత్రి మాట కేసీఆర్ నోటి నుండి రానేలేదు. ముఖ్యమంత్రి సీటు రా..రమ్మని పిలుస్తుంటే.. ఇచ్చిన మాట కోసం వదులుకుంటారా..ఏంటి..? అందుకే తూచ్ తొండి.. నేనే ముఖ్యమంత్రిని అని సిఎం పీఠం ఎక్కేశారు.. తన మాటను హుస్సేన్ సాగర్ లో తొక్కేశారు.
కేటీఆర్.. ప్రస్తుతం తెలంగాణ మంత్రుల్లో రెడ్ బుల్ తాగిన వాడిలా.. మాంచి హుషారుతో ఉన్న మంత్రిగారు కేటీఆర్. ముఖ్యమంత్రి కొడుకుగా.. తనకు కావాల్సిన ఫ్లాట్ ఫాం సిద్దంగా ఉండటంతో.. బరిలోకి దిగి... ఎదుటి పక్షానికి చెమటలు పట్టిస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లలో టీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తాయి.. మేం సెంచరీ కొడతాం.. సింగిల్ పార్టీగానే మేయర్ సీట్ ను దక్కించుకుంటాం అని అన్నారు. అలా జరగని పక్షంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. కానీ నిజానికి జిహెచ్ఎంసీ ఫలితాల్లో సీన్ రివర్పైంది అయినా కానీ కేటీఆర్ కే క్రెడిట్ దక్కింది. ఒక్క సీటు తేడాతో సెంచరీ మిస్సైంది. అయితే కేటీఆర్ మాత్రం తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యలేదు.. పైగా మరో శాఖను కూడా బహుమానం కింద కొట్టేశాడు.
రేవంత్ రెడ్డి...తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో కీలక నేత.. తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఎప్పుడూ విరుచుపడే రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్, కేటీఆర్ కు ఏమాత్రం తీసిపోరు. అయ్యగారికి మీడియా కనిపిస్తే చాలు పూనకం వస్తుంది.. ఒంట్లోకి ఏదో శక్తి ప్రవేశిస్తుందో ఏమో కానీ తెగ హాట్ కామెంట్లు చేసి మీడియా వాళ్లకు పని చెబుతుంటారు. అయితే సారు కూడా జిహెచ్ఎంసీ ఫలితాలకు ముందు తొడగొట్టారు. కారు పార్టీ వోళ్లకు సీన్ లేదు.. కేటీఆర్ అన్నట్లు వంద సీట్లు రావు.. ఒకవేళ వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ విసిరాడు. కానీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న టైంలోనే .. లేదు లేదు కేటీఆర్ సవాల్ విసిరితే నేను సై అన్నా అంతే కానీ నేను సవాల్ విసరలేదు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి అయ్యగారికి ఇచ్చిన మాట అంటే ఎంత విలువో అర్థమవుతుంది.
నారాయణ... సిపిఐ నారాయణ అనే కన్నా చికెన్ నారాయణ అన్న పేరుతో ఎక్కువ పాపులర్ అయిన ఎరుపు చొక్కా లీడర్. అప్పుడప్పుడు తన ప్రాసలతో. పొలిటికల్ జోక్స్ పేలుస్తుంటారు. నారాయణ గారు కామెడీ చేస్తే. ముందున్న మీడియా వాళ్లే నవ్వలేక.. చచ్చిపోతారట. అందుకే నారాయణ మాట్లాడుతుంటే.. స్కూల్ లో టీచర్ పాఠం విన్నట్లు చక్కగా వింటారట. అయితే అసలే రాజకీయ నాయకుడు అందునా.. చికెన్ నారాయణ మరి మాట తప్పడంతో అయ్యగారు కూడా పోటీ ఇవ్వాలి. కదా అందుకే తాజాగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు వస్తే తన చెవి కోసుకుంటా అని స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఫలితాలు వెలువడే లైంటో మీడియా వాళ్లు సార్.. టీఆర్ఎస్ కు వంద సీట్లు దాటేలా ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తారు అంటే.. అవన్నీ స్పోర్టివ్ గా తీసుకోవాలి... ఎదుటి వాళ్లను చంపేస్తామని అంటాం అంత మాత్రాన చంపేస్తామా ఏంటి.. ఇదంతా పాలిటిక్స్ లో కామనే అంటూ ఒక్క మాటతో ముగించేశారు.
ఇలా ఎవరికి వాళ్లు తమ ప్రతిభను మొత్తం మీడియా ముందు, ప్రజల ముందు బయటపెడుతున్నారు. అయితే మరి పొలిటికల్ లీడర్లు ఇలా ప్రజల ముందు హామీ ఇచ్చి... వాటిని నెరవేర్చడమో లేదంటే పాటించడమో చెయ్యకపోతే ఎలా అంటే అసలు ఎవ్వరు పట్టించుకుంటారని.. ఏదో న్యూస్ ఛానల్స్ లో కామెడీ బిట్ వచ్చిందని కాసేపు నవ్వుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు అన్నది నిజం. మరి మాట ఇచ్చిన వాళ్లు.. గొర్రెలా..? లేదంటే.. మాట విన్న వాళ్లు గొర్రెలా..? అంటే ఖచ్చితంగా మాట విన్న వాళ్లే గొర్రెలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more