తెలంగాణ టీడీపీకి బీటాలు వారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 15 స్థానాలను గెలిచిన టీడీపీ తాజా బలం మాత్రం కేవలం ఆరు స్థానాలకే పరిమితం అయ్యింది. శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలం మరింతగా తగ్గిపోయింది. దీంతో త్వరలోనే తెలంగాణ టీడీపీని తెరాసలో విలీనం చేసేందుకు లేఖ కూడా రాస్తామని టీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలం మరింతగా తగ్గిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. వివేక్, ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్‌లతో కలిపి ఇప్పటికి 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లో చేరారు. మిగిలిన ఆరుగురిలో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వున్నా.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయనను మినహాయిస్తే.. ఇక మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారు మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డి (కొడంగల్), ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణ్‌పేట), హైదరాబాద్ నుంచి మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి). అయితే సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డీలపై ఓటుకు నోటు కేసు నమోదైన విషయం తెలిసిందే.
టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు
1. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్
2. చల్లా ధర్మారెడ్డి పరకాల
3. తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం
4. మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి
5. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం
6. జి.సాయన్న కంటోన్మెంట్
7. కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్
8. ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి
9. ప్రకాశ్ గౌడ్ రాజేంద్రనగర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more