U-19 World Cup final: West Indies skittles India out for 145

Joseph john help windies bundle out india

india u19 vs west indies u19 live, live ind u19 vs wi u19, ind u19 vs wi u19 live, live ind u19 vs wi u19, india u19 west indies u19 live, ind vs wi world cup final, u19 world cup final live, live u19 world cup final, ind vs west indies u19 final live score, ind vs wi u19 match live score, u19 world cup final live, live score u19 world cup final,

Sarfaraz Khan waged a lone battle while West Indies pace attack dominated the proceedings.

విండీస్ ముందు 146 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన యువభారత్

Posted: 02/14/2016 12:53 PM IST
Joseph john help windies bundle out india

అండర్-19 వరల్డ్ కప్ లో తన మెరుగైన ఆటతీరుతో అత్యుత్తమ ప్రతిభతో రాణించిన టీమిండియా యువ ఆటగాళ్లు.. ఫైనల్లో మాత్రం వెస్టిండీస్ ముందు బొక్కబోర్లా పడ్డారు. బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత కుర్రాళ్ల జట్టు 45.1 ఓవర్లలోనే 145 పరుగులకు ఆలౌటయ్యారు. నిర్ణీత 50 ఓవర్లు కూడా క్రీజులో కుదురుకోలేకపోయిన జట్టు కేవలం 2.92 సగటున పరుగులు చేసిన అదే విజయలక్ష్యాన్ని విండీస్ కు నిర్ధేశించింది. మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే 51 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. 89 బంతులు ఎదుర్కొన్న ఖాన్ 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఈ పరుగులు సాధించాడు. ఆ తరువాత లంరోర్, బాతం కూడా రమారమి ఇరవై పరుగుల స్కోరుకు చేరువలో పరుగులు చేయడంతో భారత్ కనీసం 145 పరుగులు చేయగలిగింది.

వీరు మినహా మిగతా బ్యాట్స్ మెన్లు ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. యువభారత జట్టులో ఏ ఇద్దరు బ్యాట్స్ మెన్ల మధ్య కూడా భాగస్వామ్యం నెలకొల్పడంలో టీమిండియా విఫలమైంది. అందరు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో భారత్ 145 పరుగులు మాత్రమే సాధించింది. పంత్ 1, కిషన్ 4, అన్ మోల్ ప్రీత్ 3, సుందర్ 7, అర్మాన్ జాఫర్ 5, లంరోర్ 19, డాగర్ 8, అవేష్ ఖాన్ 1, ఆర్ఆర్ బాతం 21, కేకే అహ్మద్ 2 పరుగులు చేశారు. 23 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో లభించాయి. విండీస్ బౌలర్లలో జోసఫ్, జాన్ లకు చెరో మూడు వికెట్లు లభించాయి. మరికాసేపట్లో 146 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో వెస్టిండీస్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Under-19 cricket World Cup final  West Indies  India  

Other Articles